ఫినిషింగ్ టచ్ ఇచ్చిన సీఎం జగన్

సోమవారం నుంచి గురువారం వరకు 4 రోజులపాటు అసెంబ్లీ ఘాటుగా జరిగింది. చంద్రబాబుని జగన్ బ్యాచ్ ఉతికి ఆరేసింది. ఈ వారానికి చివరిరోజు శుక్రవారం మాత్రం సమావేశాలు కాస్త చప్పగా సాగాయి. సాయంత్రం వరకూ పెద్దగా వాదోపవాదాలు వినిపించలేదు. అలాగని అర్థవంతమైన చర్చ జరిగిందా అంటే అదీలేదు. పదే పదే అడిగిన ప్రశ్నలే అడిగి, రెండోప్రశ్న వేసిన తర్వాత కూడా పాత ప్రశ్నకి అనుబంధ ప్రశ్నలు వేస్తూ మంత్రులతో పాటు, స్పీకర్ ని కూడా విసిగించారు టీడీపీ ఎమ్మెల్యేలు.

అయితే చివరిలో మాత్రం సీఎం జగన్ ఆ లోటు భర్తీ చేశారు. చంద్రబాబుకి ఫుల్లుగా కోటింగ్ ఇచ్చి సభ ముగించారు. కోరి మరీ జగన్ ని కెలుక్కుని సున్నం పెట్టించుకున్నారు చంద్రబాబు. విద్యత్ ఒప్పందాలు, కొనుగోళ్లపై చర్చ జరుగుతున్న సందర్భంగా రాష్ట్ర ప్రతిష్టను దిగజారుస్తున్నారని వైసీపీపై మండిపడ్డారు చంద్రబాబు. మీవల్లే రాష్ట్రానికి పెట్టుబడులు రావడంలేదని, రెండు నెలలకే రాష్ట్ర ప్రతిష్టను మసకబారుస్తున్నారంటూ చౌకబారు విమర్శలు చేశారు.

జగన్ వల్లే వరల్డ్ బ్యాంక్ కూడా అప్పివ్వకుండా వెనక్కు వెళ్లిపోయిందనే నిందను మోపారు. చివరిగా పీపీఏల విషయంలో అప్పటి సీఎం వైఎస్సార్ ఏమీ చేయలేకపోయారని సెటైరిక్ గా మాట్లాడారు. ఐదేళ్లపాటు పీపీఏలపై సమీక్షలు జరిపి చివరికి అన్నీ పక్కాగా ఉన్నాయంటూ తేల్చి వైఎస్సార్ చేతులెత్తేశారని ఎద్దేవా చేశారు. దీంతో జగన్ కలుగజేసుకుని చంద్రబాబుకి మరో కోటింగ్ వేసుకున్నారు.

బాబు కోరుకున్న చివరి పంచ్ విసిరి సభ ముగించారు జగన్. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటావు ఏందయ్యా నీకు తెలిసింది అంటూ తీవ్ర స్వరంతో మాట్లాడారు జగన్. స్లైడ్ షోతో విద్యుత్ కొనుగోళ్ల విషయంలో ఎన్నికోట్ల రూపాయల మోసం జరిగిందీ ఉదాహరణలతో సహా వివరించారు.

దీంతో చంద్రబాబు అవాక్కయ్యారు. స్లైడ్ షో స్టార్ట్ కావడంతోనే మరోసారి బుక్కయ్యానని బాబుకు అర్థమైంది. శుక్రవారం సభ కాస్త ప్రశాంతంగా సాగిపోతుందనుకుంటున్న టైమ్ లో కోరి మరీ జగన్ తో పంచ్ లు వేయించుకున్నారు చంద్రబాబు. 

ఆమెను ఆమెగా ప్రేమించేవాడే కావాలట..!

ఎన్ని సినిమాలు పోయినా తీస్తూనే ఉంటా..

Advertising
Advertising