ఢిల్లీ టూర్ ముగించిన జగన్.. బాబులో ఒకటే టెన్షన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 2 రోజుల ఢిల్లీ పర్యటన విజయవంతంగా ముగిసింది. హోం మంత్రి అమిత్ షాతో నిన్ననే భేటీ అయిన ముఖ్యమంత్రి, ఈరోజు మరోసారి అమిత్ షాను కలిసి మరిన్ని అంశాలపై క్లారిటీ ఇచ్చారు.

విభజన చట్టంలోని హామీలను నెరవేర్చమని కోరిన జగన్.. మూడు రాజధానుల అంశంపై అమిత్ షాతో చర్చించారు. మరోవైపు శాసనమండలి రద్దు ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తిచేయాలని కూడా కోరినట్టు తెలుస్తోంది. వీటితో పాటు అత్యంత కీలకమైన అమరావతి భూ కుంభకోణం, ఫైబర్ గ్రిడ్ స్కామ్, అంతర్వేది ఘటనపై కూడా హోమ్ మంత్రికి వివరణ ఇచ్చారు సీఏం.

మరీ ముఖ్యంగా అమరావతి భూ కుంభకోణంపై రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న దర్యాప్తులపై కోర్టు స్టే లు ఇచ్చిన విషయాల్ని అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు జగన్. తక్షణం అమరావతి భూకుంభకోణంపై సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరారు. దీంతో పాటు అంతర్వేది ఘటనపై కూడా సీబీఐ దర్యాప్తు కోరారు. జగన్ విజ్ఞప్తికి అమిత్ షా సానుకూలంగా స్పందించారు.

అమరావతిలో భారీ కుంభకోణం జరిగిందని ఎన్నికలకు ముందు నుంచి ఆరోపిస్తున్నారు జగన్. అధికారం చేపట్టిన తర్వాత దానిపై ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటుచేశారు. తర్వాత సిట్ ఏర్పాటుచేశారు. నిజాలు నిగ్గుతేల్చారు. దీని ఆధారంగా ఏసీబీ కేసు కూడా నమోదుచేసింది. ఆ వెంటనే టీడీపీ నేతలు దీనిపై హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. ఈ విషయాలన్నీ అమిత్ షాకు పూసగుచ్చినట్టు వివరించారు జగన్. 

వ్యవస్థను కాపాడాల్సిన కోర్టే ఇలా చేస్తే

Show comments