అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబుకు చాకిరేవు

ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటావు, ఏందయ్యా నీ ఇండస్ట్రీ, దేంట్లో ఉంది నీకు అనుభవం.. అని నిండు సభలో సీఎం జగన్ చంద్రబాబుని ఏకి పారేస్తుంటే.. బిక్కమొహం వేసుకుని చూడ్డం తప్పించి ఏమీ చేయలేని పరిస్థితిలోకి వెళ్లిపోయారు బాబు. తలకు హెడ్ ఫోన్ తగిలించుకుని చేతిలో వైర్ నలుపుకుంటూ బిత్తర చూపులు చూస్తున్న చంద్రబాబుని చూస్తే పగోడికి కూడా ఇలాంటి కష్టం రాకూడదు అనుకుని ఉంటారు అంతా. అలా అయిపోయింది అసెంబ్లీలో చంద్రబాబు పరిస్థితి.

బడ్జెట్ సమావేశాల తొలిరోజే బాబుకి జగన్ చేతిలో మూడిందని అర్థమైంది. దానికి కొనసాగింపులా ప్రశ్నోత్తరాల సమయంలో కాపు రిజర్వేషన్ అంశం ప్రస్తావనకొచ్చినప్పుడు చంద్రబాబుని ఓ ఆట ఆడేసుకున్నారు జగన్. చంద్రబాబు తీరు, కుక్కతోక తీరు రెండూ ఒకటేనని ఆ రెండూ ఎప్పటికీ చక్కగా రావు అని ఘాటుగా విమర్శించారు ముఖ్యమంత్రి. యథేచ్ఛగా అబద్ధాలు ఆడ్డమే కాకుండా సిగ్గులేకుండా తిరిగి తమపై బురద జల్లడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని, కాపు రిజర్వేషన్ల విషయంలో బాబు వేసిన కుప్పిగంతుల్ని ఆధారాలతో సహా వివరించారు.

బాబు చేసిన పాపాలే ఆయనకు శాపాలై 23 సీట్లు వచ్చాయని, అవి చివరకు 13 అవుతాయని, ఆ తర్వాత అవి కూడా రాకుండా బాబు అలా అలా బైటకు వెళ్లిపోతారని అన్నారు. పోనీ చంద్రబాబు కాస్త సీరియస్ గా ఫేస్ పెడితే.. అప్పుడూ వదిలిపెట్టలేదు. రెండు కళ్లు ఇలా బైటకుపెట్టి, తల అలా పైకెత్తి చూస్తే భయపడిపోతాననుకుంటున్నావా బాబూ అంటూ జగన్ చురక అంటించారు. దీంతో మాజీ ముఖ్యమంత్రికి బిత్తర చూపులే దిక్కయ్యాయి.

ఓ దశలో నువ్వు ఇంకా సీఎం అనుకుంటున్నావా, నువ్వు ప్రతిపక్షంలో ఉన్నావ్, ఆ విషయం గుర్తుంచుకో, కనీసం సభాధ్యక్షుడితో ఎలా ఉండాలి, సభలో ఎలా ఉండాలి అనే విషయాలు కూడా తెలియని ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ దేనికయ్యా నీకు అంటూ తేరుకోకుండా పంచ్ లపై పంచ్ లు విసురుతూ బాబుని పూర్తిగా ఇరుకున పెట్టారు జగన్. ముఖ్యమంత్రి జోరు చూస్తుంటే బాబు కచ్చితంగా అసెంబ్లీకి సెలవు పెడతారని అర్థమైపోతోంది.

ఈనెల 30 వరకు అసెంబ్లీ సమావేశాలున్నాయి. రోజుకో ఎపిసోడ్ చొప్పున బాబుకి చాకిరేవు స్టార్ట్ చేసి పూర్తిగా కార్నర్ చేస్తున్నారు జగన్. బాధాకరమైన విషయం ఏంటంటే.. బాబుకు మద్దతుగా ఆయన పార్టీ నుంచి ఎవరూ లేకపోవడమే. అచ్చెన్నాయుడు మాత్రమే లేస్తున్నారు. కానీ ఆయనకు అన్ని విషయాలపై అనుభవం ఉండడంలేదు. గోరంట్ల ఏదో ప్రయత్నిస్తున్నారు కానీ వయసురీత్యా ఆయన మాటల్లో వాడి, వేడి లోపించింది. గంటా లాంటి నేతలు జగన్ పై కామెంట్ చేయడానికే భయపడుతున్నారు. దీంతో అసెంబ్లీలో చంద్రబాబు ఒంటరయ్యారు. 

మళ్ళీ ఆత్మగౌరవం నినాదం.. మారానని ప్రచారం

 

Advertising
Advertising