మార్పు కోసం నిర్భయంగా ఓటేయండి

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. భార్య వైఎస్ భారతితో కలిసి కడపజిల్లా పులివెందులలో ఓటు వేశారు జగన్. ప్రజలంతా ధైర్యంగా ఓటేయాలని, మార్పు కోసం ఓటేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు జగన్.

"ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోండి. మార్పు కోసం ఓటేయండి, భయపడకుండా ఓటేయండి. వ్యవస్థలో మార్పు తీసుకురండి. దేవుడి దయతో ప్రజల అందరి దీవెనలతో అధికారంలోకి వస్తామనే సంపూర్ణ నమ్మకం ఉంది."

పులివెందులలో 45 నిమిషాలు ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమవ్వడంపై తీవ్ర ఆసంతృప్తి వ్యక్తంచేశారు జగన్. పోలింగ్ సమయాన్ని పొడిగించాల్సిందిగా మీడియా ద్వారా ఎన్నికల సంఘాన్ని కోరారు. నేషనల్ మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడిన జగన్.. ఎన్ని సీట్లు వస్తాయనే అంశంపై స్పందించలేదు.

జాతీయ స్థాయిలో జరిగిన సర్వేలన్నీ నిజమౌతాయని మాత్రం అన్నారు, నేషనల్ లెవెల్లో జరిగిన దాదాపు 99శాతం సర్వేల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందని తేలిన విషయం తెలిసిందే.