జగన్ అనే నేను

మీడియాను, అనుభవజ్ఞులైన సీనియర్ జర్నలిస్ట్ లను ఫేస్ చేయడం అన్నది రాజకీయ నాయకులకు అంత సులువు కాదు. జగన్ అంటే నూటికి తొంభై శాతం తెలుగు మీడియా ఎలా కార్నర్ చేయాలా అన్నది చూస్తుంది?

తెలుగునాట రెండు పత్రికలు, నాలుగైదు చానెళ్లు సదా చంద్రబాబుకు అంగరక్షకుల మాదిరిగా వుంటాయి. వాళ్లంతా జగన్ కు కవరేజ్ ఇవ్వడమే కష్టం. సరే, అకేషన్ వచ్చింది తప్పదు అని ఇంటర్వూ చేసినా, వీలయినంత కార్నర్ చేయడానికే చూస్తారు. 

జగన్ పాదయాత్ర పూర్తి కావచ్చింది. ఈ నేపథ్యంలో మీడియా సంస్థలు వైఎస్ జగన్ ను ఇంటర్వూలు చేయడం ప్రారంభమైంది.

తొలిసారి సాక్షి మీడియా ఇంటర్వ్యూ చేసింది. సాక్షి మీడియా అన్నది జగన్ కు చెందినది కాబట్టి దాని గురించి పెద్దగా మాట్లాడుకోవడానికి ఏమీ లేదు.

కానీ తరువాత వంతు టీవీ9 కి వచ్చింది. టీవీ9 తెలుగుదేశానికి అనుకూలం అనే జనాభిప్రాయం కొంత వుంది. ఇటీవల టీవీ9 తెరాస అనుకూల వ్యక్తుల చేతుల్లోకి వచ్చిందనీ వార్తలు వచ్చాయి.

ఈ సంగతి అలా వుంచితే టీవీ9 సీనియర్ జర్నలిస్ట్ రజనీకాంత్ వైకాపా అధ్యక్షుడు జగన్ ను ఇంటర్వ్యూ చేసారు. ఈ ఇంటర్వూలో జగన్ చాలా అద్భతంగా మాట్లాడారు. చాలా పకడ్బందీగా సమాధానాలు ఇచ్చారు. ఎక్కడా తడబాటు లేదు. ఎక్కడా తప్పించుకునే ఆలోచన లేదు. ఎక్కడా పడికట్టు పదాలు వాడలేదు. ప్రతి ప్రశ్నకు చాలా క్లారిటీగా సమాధానం ఇచ్చారు. ఎక్కడా ఆవేశ పడిన దాఖలాలు లేవు. ఆలోచించి మాట్లాడానట్లు ఎక్కడా కనిపించలేదు. చెప్పిన ప్రతి పాయింట్, తన మనసులో ఎప్పటి నుంచో స్టోర్ లో వున్న రీతిలో చెపుతూ వచ్చారు.

ఆ మధ్య మేధావి వర్గ రాజకీయ నాయకుడు ఉండవల్లి ఓ మాట అన్నారు. వాగ్దాటిలో వైఎస్ జగన్ వాళ్ల నాన్న రాజశేఖర్ రెడ్డి కన్నా మిన్న అన్నారు. మంచి వక్త అన్నారు. టీవీ9 చేసిన ఇంటర్వ్యూలో ఈ విషయం మరోసారి స్పష్టమయింది. ఏ మాత్రం మొహమాట పడకుండా ఆ రెండు పత్రికలు, కొన్ని చానెళ్లు ఏ విధంగా చేస్తున్నాయని కుండ బద్దలు కొట్టారు.

హోదా, జీఎస్టీ, నోట్ల రద్దు మీద చాలా క్లియర్ గా మాట్లాడారు. అలాగే మోడీ, కేసిఆర్ బంధాలపై క్లియర్ గా చెప్పాల్సింది చెప్పారు. పొత్తుల మీద, పవన్ కళ్యాణ్ మీద తన అభిప్రాయాలు కుండబద్దలు కొట్టినట్లు వివరించారు. గత నాలుగేళ్లలో చంద్రబాబు చేసిన అవినీతిని తాను అధికారంలోకి వస్తే కచ్చితంగా ఎక్స్ పోజ్ చేస్తామని, సాక్ష్యాధారాలు పకడ్బందీగా వుంటే కోర్టుకు తీసుకెళ్తానని క్లియర్ గా చెప్పేసాడు. 

టోటల్ గా ఎక్కడా ఎదురు ప్రశ్నించే అవకాశం కానీ, కార్నర్ చేసే అవకాశం కానీ, ఇవ్వలేదు. టోటల్ ఓ అనుభవం, రాటు దేలిన రాజకీయ వేత్త మాదిరిగా మాట్లాడాడు జగన్. ఇదే కనుక కాస్త మీడియా అండ వుంటే జనాల్లోకి తన అభిప్రాయాలను మరింత బలంగా చెప్పగలిగే అవకాశం వుండేది. 

Show comments