ప్రభాస్ కొత్త సినిమాకు వెరైటీ టైటిల్

కొత్త సినిమాలకు సంబంధించి రకరకాల టైటిల్స్ చక్కర్లుకొట్టడం మామూలే. వాటిలో ఏదో ఒకటి ఫైనల్ అవ్వడం కూడా అంతే కామన్. ప్రభాస్ కొత్త సినిమాకు కూడా ఈ వ్యవహారం మొదలైంది. కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఓ హిందీ టైటిల్ తో పాటు మరో ఫ్రెంచ్ టైటిల్ పోటీపడుతున్నాయి. తెలుగు టైటిల్ మాత్రం లిస్ట్ లో లేదు.

రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు జాన్ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు తాజాగా కథనాలు వస్తున్నాయి. జాన్ అనేది తెలుగుపదం కాకపోయినా, దాదాపు అందరికీ పరిచయమైన పేరే. అందుకే ఇదే టైటిల్ ను పెట్టొచ్చనే ప్రచారం సాగుతోంది. 

మరోవైపు ఆశ్చర్యకరంగా ఓ ఫ్రెంచ్ టైటిల్ కూడా తెరపైకొచ్చింది. దాని పేరు అమూర్. ఫ్రెంచ్ భాషలో అమూర్ అంటే ప్రేమ అని అర్థం అట. కథ ప్రకారం సినిమాది కూడా యూరోప్ బ్యాక్ డ్రాప్ కాబట్టి అమూర్ అనే టైటిల్ కూడా తెరపైకొచ్చింది. కానీ ఈ టైటిల్ కంటే జాన్ అనే పేరుకే ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు.

ప్రస్తుతం ప్రభాస్ కొత్త సినిమా షూటింగ్ ఇటలీలో జరుగుతోంది. ప్రభాస్-పూజా హెగ్డే మధ్య కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కోసం ప్రభాస్ మీసం తీసేసి కొత్తగా మేకోవర్ అయ్యాడు.

Show comments