ఇవన్నీ మర్చిపోండి

గత నాలుగేళ్లుగా మోడీతోనే చంద్రబాబు కలిసి వున్నారన్న సంగతి..
గత నాలుగేళ్లుగా మోడీని ఆయన భుజాన చంద్రబాబు మోసిన వైనం..
కాంగ్రెస్ ను తల్లి కాంగ్రెస్ గా అభివర్ణించి, వైకాపాతో ముడేసిన పద్దతి..
ఉద్యోగులకు కనీసం డిఎ కూడా సరిగ్గా ఇవ్వని వాస్తవం..
రాష్ట్రంలో అనేకానేక రోడ్ల అభివృద్ధికి, పల్లెల్లో సిమెంట్ రోడ్లకు కేంద్ర నిధులే కారణం అన్న పచ్చి నిజం..
ఇసుక మీద అధికార పక్షం నేతలు భయంకరంగా దోచేసుకున్న వ్యవహారం...
నాలుగేళ్ల పాటు 9, 10వ తరగతి పిల్లలకు సైకిళ్లు ఇవ్వడం ఆపేసిన పరిస్థితి..

అవును ఇది నిజం. తెలుగుదేశం అను'కుల' మీడియా ఇదే రివర్స్ లో చాటింపు వేస్తోంది. అయిదేళ్లకు కాస్త తక్కువగా వున్న కాలంలో బాబు వైనాలు అన్నీ మరిచిపోమంటోంది. అస్సలు వాటిని గుర్తుచేసే ప్రయత్నం పొరపాటున కూడా చేయడంలేదు. పైగా ఇప్పటి విషయాలు మాత్రమే ప్రస్తావిస్తోంది. అందుకే ఇలా.. చాలా చాలా విషయాలు మరచిపోయి తెలుగుదేశం పార్టీకే ఓటేయాలి అంటోంది. ఇప్పటి పరిస్థితుల ప్రకారం సంక్షేమ పథకాల పుణ్యమా అని బాబుదే గెలుపు అని జోస్యం చెబుతోంది.

పైగా బాబుకు ఎందుకు ఓటేయాలంటే.. మోడీ జగన్ కలిసిపోయారు. జగన్ కు కేసిఆర్ మద్దతు ఇస్తున్నారు. అందరూ కలిసి బాబును ఒంటరిని చేస్తున్నారట. (గత ఎన్నికల్లో ఈ అందరూ కలిసి జగన్ ను ఒంటరి చేసారన్నది మళ్లీ మర్చిపోవాలి) బాబు ఇప్పుడు ఎన్నికల ముందు తాయిలాలు ప్రకటించారు.(అంతకు ముందు పార్టీ నేతల సంక్షేమం మాత్రమే చూసారు) ప్రకటించిన తాయిలాల్లో 90శాతం ఎన్నికల తరువాత అంటే జూలై నుంచి అమలు చేస్తామంటూ కండిషన్ పెట్టిన సంగతి మాత్రం చూడకండి.

జనాలు వెర్రివాళ్లా? వాళ్లకు ఈ అను'కుల' మీడియా మాత్రమే వుందా? వాస్తవాలు  దాచేయడానికి. సోషల్ మీడియా ఇళ్లలోకి, పల్లెల్లోకి చొరబడిపోయింది. ఇక నిజాలు దాచడం కష్టం అని ఈ 'కుల'మీడియా ఎప్పుడు తెలుసుకుంటుందో? బహుశా ఎన్నికల ఫలితాల తరువాతేమో?

ప్రజలు చంద్రబాబు కన్నా తెలివైన వారు!

అంతా అనైతికం, చెప్పేవి మాత్రం నీతులు

Show comments