సస్పెన్స్ కు తెర.. నోటాకు లైన్ క్లియర్

మొన్నటివరకు ఈ సినిమాపై చాలా ఉత్కంఠ నడిచింది. ఎన్టీఆర్ సినిమాకు ముందు రావాలా, ఎన్టీఆర్ సినిమా విడుదలైన తర్వాత రావాలా అనే తర్జనభర్జనలో పడ్డారు మేకర్స్. దీనికి తోడు బిజినెస్ కూడా ఆశించిన స్థాయిలో అవ్వకపోవడంతో వాయిదాకే మొగ్గుచూపారంటూ ఒకదశలో వార్తలు వచ్చాయి. ఎట్టకేలకు ఈ మేటర్ పై సస్పెన్స్ కు తెరపడింది. 

నోటా రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమా తెలుగు-తమిళ భాషల్లో ఒకేసారి అక్టోబర్ 5న విడుదలకాబోతోంది. ఇది క్లియర్. ఇకపై ఎలాంటి సందేహాలు, అనుమానాలు అక్కర్లేదని మేకర్స్ వివరణ ఇచ్చారు. 

విడుదల తేదీ ప్రకటించడానికి ముందు విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో తనదైన శైలిలో ప్రచారం స్టార్ట్ చేశాడు. ఏ తేదీకి విడుదల చేయాలో మీరే చెప్పండంటూ చిన్నపాటి పోల్ నిర్వహించాడు. అప్పటికే మేటర్ లీక్ అవ్వడంతో ఎక్కువమంది అక్టోబర్ 5కే ఓటేశారు. తర్వాత అదే తేదీని అఫీషియల్ గా ప్రకటించాడు దేవరకొండ.

విజయ్ దేవరకొండ, మెహ్రీన్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు ఆనంద్ శంకర్ దర్శకుడు. స్టుడియో గ్రీన్ బ్యానర్ పై జ్ఞానవేల్ రాజా నిర్మించాడు. విజయ్ దేవరకొండకు కోలీవుడ్ డెబ్యూ మూవీ ఇది.

Show comments