ఐటీవలలో టీడీపీ నేత.. రూ.కోట్లు దొరికాయా!

టీడీపీ నేత, ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి వ్యాపార సామ్రాజ్యంపై ఐటీదాడులు జరిగినట్టుగా తెలుస్తోంది. ఈ సోదాల్లో భారీస్థాయిలో నగదు.. విలువైన డాక్యుమెంట్లను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారని సమాచారం. ఈ మధ్యకాలంలో టీడీపీకి చెందిన కోస్తా ప్రాంత నేతల వ్యాపార సామ్రాజ్యాలపై ఐటీదాడులు జరిగాయి. కొంత విరామం తర్వాత ఇప్పుడు మాగుంట వంతు వచ్చింది.

విశేషం ఏమిటంటే.. ఐటీ దాడులన్నీ చెన్నై కేంద్రంగా వ్యాపారాలను నడిపిస్తున్న టీడీపీ నేతలపైనే సాగుతున్నాయి. మాగుంట వ్యాపార సామ్రాజ్యం కూడా చెన్నై వేదికగానే సాగుతూ ఉంది. చెన్నైలోని బజుల్లా రోడ్డులోని మాగుంట ఆఫీసులో ఐటీసోదాలు జరిగాయని తెలుస్తోంది. అలాగే చెన్నై శివారుల్లోని మాగుంటకు సంబంధించిన డిస్టిలరీ ఫ్యాక్టరీలో కూడా సోదాలు జరిగాయి.

ఆఫీసులో డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్న అధికారులు, డిస్టిలరీ ఫ్యాక్టరీలో భారీ మొత్తం డబ్బును పట్టుకున్నారని సమాచారం. దాదాపు యాభై ఐదు కోట్ల రూపాయల నగదును అధికారులు పట్టుకున్నారని తెలుస్తోంది. చెన్నైలో ఇటీవలే ఒక హవాలా ముఠా పట్టుబడగా.. ఆ కేసు విచారణ మాగుంట వ్యాపార సామ్రాజ్యంపై ఐటీదాడులకు దారితీసిందని సమాచారం.

భారీ మొత్తమే దొరికినట్టుగా వార్తలు వస్తున్నాయి. మరి చంద్రబాబు నాయుడు మళ్లీ గగ్గోలు పెడతాడేమో. చెన్నైలో టీడీపీ నేతల వ్యాపారాలపై ఐటీదాడులు జరుగుతున్నాయి కాబట్టి.. ఏపీకి పెట్టుబడులు రావని బాబు విరుచుకుపడతాడేమో!

తెలంగాణ తీర్పు ప్రభావం.. ఏపీపై ఉంటుందా? చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్ 

Show comments