ఆసీస్ గడ్డపై టీమిండియా అద్భుతం!

ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియా మీద టెస్టుల్లో విజయం అంటే.. అది ఏ క్రికెట్ జట్టుకు అయినా మరపురాని ఘట్టం. దశాబ్దాల టెస్టు క్రికెట్ చరిత్రలో టీమిండియా ఆస్ట్రేలియా గడ్డ మీద టెస్టుల్లో సాధించిన విజయాలు వేళ్ల మీద లెక్కబెట్టదగిన స్థాయివే. ఇలాంటి చరిత్ర నేపథ్యంలో అడిలైడ్ టెస్టులో టీమిండియా చిరస్మణీయమైన విజయాన్ని సాధించింది. నాలుగు టెస్టుల సీరిస్ ను విజయంతో మొదలుపెట్టింది టీమిండియా.

ఇప్పటివరకూ ఆసీస్ లో ఎన్నో టెస్టు సీరిస్ లు ఆడిన భారత జట్టు ఇలా విజయంతో సీరిస్ ను మొదలుపెట్టిన దాఖలాలే లేవు. తొలిసారి టీమిండియా తొలి టెస్టు మ్యాచ్ లో విజయం సాధించింది. తద్వారా 1-0తో టెస్టు సీరిస్ లో ఆధిక్యత సంపాదించింది.

323 పరుగుల లక్ష్య చేధన కోసం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆసీస్ అంత తేలికగా పట్టు వద్దల్లేదు. అడిలైడ్ మైదానంలో ఈస్థాయి పరుగుల చేధన చరిత్రేలేదు. అయినా ఆసీస్ ఆఖరి వరకూ పోరాడింది. ప్రత్యేకించి ఆసీస్ టాప్ ఆర్డర్ నిన్నే చేతులు ఎత్తేసినా.. మిడిలార్డర్, టెయిలెండర్లు మాత్రం పోరాడారు.

ఒకదశలో గెలిచేస్తారేమో అనే భయాన్ని పుట్టించారు భారత అభిమానుల్లో. అయితే భారత బౌలర్లు ఆసీస్ బ్యాట్స్ మన్ కు ధీటుగా పోరాడారు. ఈ విజయంలో కీలకపాత్ర పుజారాది. రెండు ఇన్నింగ్స్ లలోనూ పుజారా అద్భుతంగా ఆడాడు.

తొలిరోజు తొలి గంటలోనే భారత బ్యాట్స్ మన్ చేతులు ఎత్తేశారు. నలభైకే నాలుగు వికెట్లు పడిపోయిన దశలో పుజరా అద్భుతమైన ఆటతీరును కనబరిచాడు. తొలి ఇన్నింగ్స్ లో సెంచరీతో భారత్ కు గౌరవప్రదమైన స్కోరును సాధించి పెట్టాడు.

పుజరా ఇచ్చిన స్ఫూర్తితో రెండో ఇన్నింగ్స్ లో భారత బ్యాట్స్ మన్ కొద్దో గోప్పో రాణించారు. దీంతో ఆసీస్ ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది టీమిండియా. డ్రా చేస్తాం.. లేదంటే గెలుస్తాం.. అంటూ మాట్లాడిన ఆసీస్ ఆటగాళ్లు ఆ మాటను నిలబెట్టుకోలేకపోయారు.

భారత బౌలర్లు అద్భుతంగా బౌల్ చేసి విజయాన్ని సాధించింది పెట్టారు. తొలి మ్యాచ్ లో నెగ్గిన భారత్.. సరిదిద్దుకోవాల్సిన అంశాలు చాలానే ఉన్నాయి. వాటిని సవరించుకుంటే.. ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియా మీద టెస్టు సీరిస్ ను నెగ్గడం కష్టంకాదు.

టిఆర్ఎస్ గెలిస్తే ఎం జరుగుతుంది?..కూటమి గెలిస్తే ఏమవుతుంది?

Show comments