ఇదిగో 'అల'.. అదిగో ప్రమోషన్ సాంగ్

బన్నీ-త్రివిక్రమ్ కాంబినేషన్ లో ముస్తాబవుతున్న సినిమా అల వైకుంఠపురములో. ఈ సినిమా క్లయిమాక్స్ సీన్ల షూటింగ్ ఇప్పుడు నడుస్తోంది. సినిమా టీజర్ ను బయటకు వదలాల్సి వుంది. దసరాకు అనుకున్నారు కానీ వీలయ్యేలా లేదు. దీపావళికే అని భావిస్తున్నారు.

ఇలాంటి టైమ్ లో ప్రమోషనల్ సాంగ్ అంటూ గ్యాసిప్ బయటకు వచ్చింది. అయితే అసలు సంగతి ఏమిటంటే, అసలు ఆ ఊసేలేదన్నది. ప్రత్యేకంగా ప్రమోషనల్ సాంగ్ చేయడం, దాన్ని వీలైతే రోలింగ్ టైటిల్స్ లో వాడడం, లేకుండా వదిలేయడం లాంటి కాన్సెప్ట్ లు ఏవీ త్రివిక్రమ్ ఆలోచించడం లేదని తెలుస్తోంది.

సినిమాలో వున్న సాంగ్స్ నే ఒక్కొక్కటిగా వదులుతారు. అయితే కేవలం లిరికల్ విడియోగా వదలకుండా, పాట పాడిన వాళ్లే పాడుతుంటే వీడియో తీసి వదిలే ఆలోచన అయితే చేస్తున్నారు. అంతకుమించి మరేమీ లేదు. ఇదిలావుంటే సినిమా షూటింగ్ ఇప్పటికి 70శాతం వరకు పూర్తయింది. టార్గెట్ రీచ్ కావడం కోసం ఒక్కరోజు కూడా మిస్ కొట్టకుండా మార్నింగ్ టు నైట్ షూట్ జరుపుతున్నారు.

సినీ ఇండస్ట్రీలో ఈ ఫీలింగ్స్‌ మరింత ఎక్కువ

Show comments