నాకు రొమాంటిక్ సినిమాలే ఇష్టం

ఇస్మార్ట్ శంకర్ లో సైంటిస్ట్ గా నటించింది నిధి అగర్వాల్. ఆమె చేసిన 3 సినిమాల్లో ఇది కాస్త వెయిట్ ఉన్న క్యారెక్టర్. అయినప్పటికీ తనకు ఇలాంటి పాత్రల కంటే రొమాంటిక్ పాత్రలే ఇష్టమంటోంది నిధి. ఎక్కువగా రొమాంటిక్ సినిమాలే నచ్చుతాయి. ఆ జోనర్ సినిమాలే చూడటానికి ఇష్టపడతాను. అందుకే యాక్టర్ గా ఎక్కువగా రొమాంటిక్ సినిమాలే చేయాలనుకుంటున్నాను.

ఇలా తన మనసులో మాట బయటపెట్టింది నిధి అగర్వాల్. ఇస్మార్ట్ శంకర్ రిలీజైన తర్వాత మీడియాతో మాట్లాడిన ఈ ముద్దుగుమ్మ, ఇప్పటివరకు సినిమా చూడలేదంటోంది. మూవీ రిలీజ్ అయిన తర్వాత ఓ దర్శకుడు పెట్టిన మెసేజ్ తో ప్రాణం లేచొచ్చిందని చెప్పుకొచ్చింది.

"రిలీజ్ రోజు పొద్దున్నే నేను విజయవాడలో ఉండగా నా ఫస్ట్ డైరెక్టర్ చందూ మొండేటి నుండి మెసేజ్ వచ్చింది. కంగ్రాట్స్ ఫర్ యువర్ ఫస్ట్ బ్లాక్ బస్టర్ అని పంపారు. అది చూడగానే చాలా హ్యాపీ గా ఫీలయ్యాను. పట్టరాని ఆనందం వచ్చింది. ఆ తర్వాత వరుసగా మెసేజీలు, కాల్స్ వచ్చాయి."

ఇస్మార్ట్ శంకర్ తో తనకు మాస్ పవర్ తెలిసొచ్చిందంటోంది నిధి అగర్వాల్. ప్రస్తుతం ఓ తమిళ సినిమాకు కమిట్ అయినప్పటికీ.. తెలుగులో మరిన్ని సినిమాలు చేయాలనుకుంటున్నట్టు వెల్లడించింది.

ఆమెను ఆమెగా ప్రేమించేవాడే కావాలట..!

ఎన్ని సినిమాలు పోయినా తీస్తూనే ఉంటా..

Show comments