నాగార్జున కావాలనే నామీద నింద వేశారు

దాదాపు 4 నెలలు కలిసి పనిచేసిన నాగార్జున, నాని ఇప్పుడు ఒకరిపై ఒకరు సరదాగా సెటైర్లు వేసుకుంటున్నారు. రీసెంట్ గా నాగార్జున చేసిన ఓ చిలిపి పని నానికి ఇబ్బందిగా మారింది. అదేంటంటే.. నాని ఎప్పుడూ మొబైల్ లో మునిగిపోతాడని నాగ్ కామెంట్ చేశాడు. దానికి ప్రూవ్ గా కొన్ని విజువల్స్ కూడా చూపించారు. ఆ వీడియో వైరల్ అయి నిజంగానే ఈ హీరో ఇంతేనేమో అనే విధంగా సోషల్ మీడియాలో నానిపై ఓ నెగెటివ్ ప్రచారం స్టార్ట్ అయింది. దీనిపై నాని రియాక్ట్ అయ్యాడు. 

"నేను ఫోన్ ఎక్కువ వాడి ఉండొచ్చు. కానీ నాగార్జున పక్కన మాత్రం అలాంటి ధైర్యం ఎప్పుడూ చేయలేదు. స్వప్న, వాళ్లు వీళ్లు చెప్పిన మాటలు విని నా మీద వీడియో చేశారు. అది కాస్తా వైరల్ అయిపోయింది. మేం కూడా ఒప్పుకుంటాం అంటూ ట్విట్టర్ లో రానా, రకుల్ కూడా ట్వీట్ చేయడంలో ఇది నా మీద ఓ నిందలా మారిపోయింది."

తను మొబైల్ కు బానిసను కాదంటూ నాని ఇలా తననుతాను సమర్థించుకున్నాడు. అంతేకాదు.. మేకింగ్ వీడియోస్ లో మొబైల్ పట్టుకున్న సన్నివేశాలు సర్వసాధారణమని, మేకింగ్ మొత్తం చూస్తే నాగార్జున ఫోన్ పట్టుకున్న వీడియోలు కూడా దొరుకుతాయంటున్నాడు నాని.

దేవదాస్ మూవీ ప్రమోషన్ లో భాగంగా మీడియాతో మాట్లాడిన నాని, డాక్టర్లపై కొన్ని కామెంట్స్ చేశాడు. తనకు తెలిసి డాక్టర్లంతా ముందుకొడతారని తెలిపిన నాని, అదే విషయాన్ని సినిమాలో చూపించామని అన్నాడు. మరోవైపు ఈ సినిమా రీమేక్ అనే విషయాన్ని కూడా నాని కొట్టిపారేశాడు. ఇది ఏ సినిమాకు రీమేక్ కాదని, కొంతమంది రచయితలు కలిసి వర్క్ చేసి, దేవదాస్ కథకు తుదిమెరుగులు దిద్దారని అంటున్నాడు.