హుజూర్ నగర్ .. పెరుగుతున్న ఆధిక్యం!

హుజూర్ నగర్ ఉప ఎన్నికలో భారీ విజయం దిశగా సాగుతూ ఉంది తెలంగాణ రాష్ట్ర సమితి. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీగా నెగ్గడంతో హుజూర్ నగర్ కు ఉప ఎన్నిక వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఉత్తమ్ భార్య పోటీకి దిగారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ వెనుకంజలో ఉంది. అధికార తెలంగాణ రాష్ట్ర సమితి ఘన విజయం దిశగా దూసుకుపోతూ ఉంది.

తొలి రౌండ్ లోనే తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి సైదిరెడ్డి మంచి ఆధిక్యత సాధించారు. ఆ తర్వాత రౌండ్ రౌండ్ కూ ఆయన ఆధిక్యం పెరుగుతూ ఉండటం గమనార్హం.తొలి రౌండ్ లో సైది రెడ్డికి 2,467 ఓట్ల ఆధిక్యం లభించింది. రెండో రౌండ్ లో మరో 1772 ఓట్లతో  అది మరింత పెరిగింది. మూడో రౌండ్ లోనూ అదే పరిస్థితి. నాలుగో రౌండ్ కౌంటింగ్ ముగిసే సమయానికి సైది రెడ్డి ఆధిక్యం 9356 ఓట్లకు చేరుకుంది.

మొత్తం 22 రౌండ్ల కౌంటింగ్ జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సైది రెడ్డి విజయం దిశగా దూసుకుపోతున్నట్టే అని పరిశీలకులు అంచనా వేస్తూ ఉన్నారు. మిగతా రౌండ్స్ లో కాంగ్రెస్ అభ్యర్థి గట్టిగా ప్రభావం చూపిస్తే మాత్రమే ఫలితం తారుమారు అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తూ ఉన్నారు. పూర్తి ఫలితంపై మరి కాసేపట్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Show comments