హోమ్ సిక్ సిఎమ్...జగన్

రాజకీయ నాయకులు అన్నాక ఇల్లు, వాకిలి పట్టకుండా తిరగాల్సిందే. ఆంధ్ర సిఎమ్ జగన్ కూడా గతంలో ఇలాగే తిరిగారు. కానీ ఎప్పుడయితే సిఎమ్ అయిపోయారో, కేవలం ఇల్లు..ఆఫీసుకే పరిమితం అయిపోయారు. 

మహా అయితే నెలకో, రెండునెలలకో పెళ్లికో, పరామర్శకో బయట అడుగు పెట్టడం, ఏ పని అయినా సాయంత్రానికి ఇంటికి చేరిపోవడం. ఇదీ జగన్ దినచర్యగా మారిపోయింది. 

విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ప్రకటించారు కానీ ఏనాడూ రెండు రోజులు అక్కడ వున్నది లేదు ఓ రాత్రి అయినా గడిపింది లేదు. 

ఇప్పుడు ఉత్తరాంధ్ర, ఒరిస్సా పర్యటనకు వెళ్తున్నారు జగన్. ఉదయం నుంచి రాత్రి ఏడు గంటల లోపే. రాత్రికి తాడేపల్లి ఇంటికి చేరిపోవాల్సిందే.

మీడియాతో మాట్లాడరు. తనపై, తన పాలనపై వస్తున్న ఆరోపణలను ఆయన తిప్పి కొట్టరు. ఉప ఎన్నికల్లో ప్రచారం చేయరు. ఏ నియోజకవర్గంలోనూ ఒక రోజు గడపరు. 

ఇలా ఎంతకాలం? మళ్లీ ఎన్నికలు వచ్చే వరకు అనుకోవాలా?  జగన్ వైఖరి మాత్రం చాలా చిత్రంగా వుంది. హోమ్ సిక్ స్టూడెంట్ మాదిరిగా. ఇల్లు వదిలి వుండలేకపోతున్నారు పాపం. 

Show comments