ఆ హీరోయిన్లు.. జంపింగ్ జపాంగ్

ఒకవైపు నాగార్జున మన్మధుడు-2.. మరోవైపు వెంకటేష్ వెంకీ మామ ఈ  రెండు సినిమాలకు ఎలాంటి సంబంధం లేదు. కానీ హీరోయిన్లు మాత్రం ఈ రెండు ప్రాజెక్టుల మధ్య భలేగా షిఫ్ట్ అవుతున్నారు. ఒక ప్రాజెక్టు నుంచి మరో ప్రాజెక్టులు జంపింగ్ లు కొడుతున్నారు.

ముందుగా మన్మధుడు-2లో పాయల్ రాజ్ పుత్ ను హీరోయిన్ గా అనుకున్నారు. కానీ ఏం జరిగిందో ఏమో, ఆమె స్థానంలో రకుల్ ప్రీత్ సింగ్ ను తీసుకున్నారు. ఈ ఆఫర్ కోసం వెంకీమామ సినిమాను వదులుకుంది రకుల్.

ఇక వెంకీమామ సినిమా విషయానికొస్తే ఈ సినిమాలో వెంకటేష్ సరసన పాయల్ హీరోయిన్ గా నటించనుంది. ఇక చైతూ సరసన రకుల్ ను తీసుకున్నారు. ఆమెను మన్మధుడు-2కు షిఫ్ట్ చేశారు కాబట్టి, ఆ స్థానంలో నభానటేష్ ను తీసుకున్నారు.

ఇక్కడితో మేటర్ ఫైనల్ అవ్వలేదు. నభానటేష్ కూడా వెంకీమామలో కొనసాగడం కష్టంగానే ఉంది. అన్నీ కుదిరితే ఆమె స్థానంలో రాశిఖన్నాను తీసుకునే ఆలోచనలో ఉన్నారు. ఈ మేరకు రాశితో సంప్రదింపులు జరపమని స్వయంగా సురేష్ బాబు ఆదేశించాడు.

ప్రస్తుతానికైతే ఈ రెండు సినిమాల విషయంలో హీరోయిన్ల దోబూచులాటలు, మ్యూజికల్ ఛైర్ ఆటను తలపిస్తున్నాయి. వీటిలో ఏదో ఒక సినిమా సెట్స్ పైకి వచ్చేవరకు ఈ జంపింగ్-జపాంగ్ లు ఆగేలా లేవు. 

రాయలసీమ రైతుల పుండుపై కారం