హీరోగా నాని 'కొడుకు'

జెర్సీ సినిమా చూసిన వాళ్లందరి దృష్టిని ఆకర్షించిన నటుడు హరీష్ కళ్యాణ్. జెర్సీ సినిమా ఓపెన్ కావడమే ఈ యువనటుడి మీద ఓపెన్ అవుతుంది. హీరో కొడుకుగా సినిమా ప్రారంభంలో, చివర్న క్లయిమాక్స్ లో చటుక్కున మెరిసాడు. మాంచి పొడవు, ఫిజిక్ తో యంగ్ హీరోగా పనికివచ్చే లక్షణాలున్న ఈ కుర్రాడు ఇప్పటికే తమిళనాట హీరో.

గత పదేళ్లుగా తమిళంలో అనేక సినిమాలు చేసాడు. తెలుగు జనాలకు గుర్తువుండి వుండదు కానీ, ఒకటి రెండు తెలుగు సినిమాల్లో కూడా చిన్న పాత్రలు చేసాడు. లేటెస్ట్ గా తమిళంలో ఆర్ ఎక్స్ 100 మాదిరిగా వుండే ఇస్పాడే రాజవమ్, ఇదయ రాణియమ్ సినిమా ఒకటి చేసాడు.

ఈ సినిమా వచ్చేనెలలో తెలుగులోకి రాబోతోంది. అంతేకాదు, ఇదే హీరోతో సరైన ప్రాజెక్టు సెట్ అయితే తెలుగులో సినిమా చేయాలని జెర్సీ సినిమాను నిర్మించిన సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థనే చూస్తోంది. తెలుగునాట సరైన యంగ్ హీరోలకు ఎంతయినా డిమాండ్ వుంది. అందువల్ల హరీష్ కళ్యాణ్ క్లిక్ అయినా కావచ్చు. అలాగే సపోర్టింగ్ హీరో క్యారెక్టర్ల కు కొదవ వుండకపోవచ్చు.

రాష్ట్ర రాజకీయంలో ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది?

జెర్సీ గురించి నాని చెప్పిన నిజాలేంటి

Show comments