అప్పుడు అంత్యాక్షరి.. ఇప్పుడు పేరడీ

హరీష్ శంకర్ సినిమాల్లో ఏమున్నా లేకపోయినా కామెడీ తప్పనిసరిగా ఉంటుంది. ఎంటర్ టైన్ మెంట్ మిస్ అవ్వకుండా చూసుకుంటాడు ఈ దర్శకుడు. మరీ ముఖ్యంగా గబ్బర్ సింగ్ నుంచి హరీష్ కు ఇదొక అలవాటుగా మారింది. అయితే త్వరలోనే థియేటర్లలోకి రాబోతున్న వాల్మీకి సినిమా కోసం మాత్రం యాజ్ ఇటీజ్ గా గబ్బర్ సింగ్ ఫార్ములానే ఫాలో అయిపోయాడు హరీష్.

గబ్బర్ సింగ్ సినిమా అంతా ఒకెత్తయితే, ఆ సినిమాలో అంత్యాక్షరి ఎపిసోడ్ మరోఎత్తు. సినిమాలో అంత్యాక్షరి ఎపిసోడ్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. సరిగ్గా అలాంటి హిలేరియస్ ఎపిసోడ్ నే వాల్మీకిలో కూడా పెట్టాడు హరీష్. కాకపోతే గబ్బర్ సింగ్ లో అంత్యాక్షరి కాన్సెప్ట్ ను తీసుకుంటే.. వాల్మీకిలో పేరడీ కాన్సెప్ట్ తీసుకున్నాడు.

హరీష్ కు చెందిన కమెడియన్స్ బ్యాచ్ మొత్తం ఈ పారడీ ఎపిసోడ్ లో ఉంది. ఇదంతా హాస్యనటుడు ప్రభాస్ శీను చుట్టూ తిరుగుతుంది. ఈ మేరకు ట్రయిలర్ లో కూడా చిన్న బిట్ పెట్టారు. భరత్ అనే నేను సినిమాలో మహేష్ చెప్పిన "ఐయాన్ నాట్ డన్ ఎట్" అనే డైలాగ్ కు పేరడీ ట్రయిలర్ లో కనిపించింది. టోటల్ గా ఈ ఎపిసోడ్ అంతా సినిమాకు హైలెట్ గా నిలుస్తుందని అంటున్నారు.

వాల్మీకి అనేది రీమేక్ ప్రాజెక్టు. ఒరిజినల్ వెర్షన్ లో కామెడీకి స్కోప్ లేదు. సినిమాలో అక్కడక్కడ కామెడీ ఉన్నప్పటికీ అది క్రైమ్ కామెడీ టైపులో సీరియస్ గా ఉంటుంది. కానీ వాల్మీకిలో మాత్రం హరీష్ మార్క్ కామెడీ ఎపిసోడ్స్ ఉన్నాయి. ఈ రీమేక్ ప్రాజెక్టుకు హరీష్ చేసిన ప్రధానమైన మార్పుల్లో ఇది కూడా ఒకటి.

అదొక్కటే.. జగన్ తప్పుడు నిర్ణయం