హరీష్ సినిమా మళ్లీ మొదటికి?

2017 జూన్ లో విడుదలయింది దువ్వాడ జగన్నాధమ్. అంటే ఏడాదిన్నర దాటిపోయంది. కానీ ఆ సినిమా డైరక్టర్ హరీష్ శంకర్ చేతిలోకి ఇంతవరకు సినిమా రాలేదు. దిల్ రాజు క్యాంప్ లో తిరిగి తిరిగి చివరకు బయటకు వచ్చి 14 రీల్స్ లో సినిమా కోసం ప్రయత్నాలు ప్రారంభించారు.

తన స్వంత కథ పక్కనపెట్టి, తమిళ రీమేక్ చేయాలనుకున్నారు. ఇద్దరు హీరోలు. వరుణ్ తేజ్ ను వప్పించారు. అంతవరకు బాగానే నడిచింది బండి. కానీ ఇప్పుడే ఏమయిందో? మళ్లీ నిచ్చెనదిగి పామునోట్లో పడినట్లు అయింది. ఆ సినిమా కూడా క్యాన్సిల్ అని టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. 

14రీల్స్ సంస్థ ప్రస్తుతం సినిమా చేసే మూడ్ లో లేదని ఒకపక్క, కాదు ఈ ప్రాజెక్టు మీద హీరోలకే పెద్దగా హోప్ లేదని మరోపక్క గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి. కారణం ఏదయితేనేం, వ్యవహారం మాత్రం మొదటికి వచ్చిందన్నది సారాంశం. అసలే హీరోలు ఖాళీ లేరు. నిర్మాతలు రెడీ. డైరక్టర్లు రెడీ. హీరోలే లేరు. అవతల ఇంద్రగంటి, మారుతి, చాలామంది హీరోల కోసం చూస్తున్నారు.

ఇలాంటి టైమ్ లో హరీష్ కు ఎవరు దొరుకుతారో? తనకు తొలి చాన్స్ ఇచ్చిన రవితేజ డేట్ లు దొరికే చాన్స్ వుంది. అక్కడ ట్రయ్ చేస్తే బాగుంటుందేమో? కానీ రవితేజ అంటే ముందుకు వచ్చే నిర్మాత కూడా కావాలి కదా?

తేలని అభ్యర్థుల ఎంపిక.. పవన్ కల్యాణ్ పనే హాయి!

కేసీఆర్, చంద్రబాబు ఫ్రంట్ గెలుపెవరిది? 

Show comments