గుణ 369 మరో ఆర్ ఎక్స్ 100

`ఆర్‌.ఎక్స్.100` ఫేమ్ కార్తికేయ హీరోగా , అన‌ఘ హీరోయిన్‌గా న‌టిస్తోన్న చిత్రం `గుణ 369`.  అర్జున్‌ జంధ్యాల ఈ చిత్రంతో దర్శకుడిగా ప‌రిచయం అవుతున్నారు. చైత‌న్ భ‌రద్వాజ్  సంగీత సార‌థ్యం వ‌హించిన ఈ చిత్రంలో `తొలి ప‌రిచ‌య‌మా ఇది... తొలి ప‌ర‌వ‌శ‌మా ఇది` అనే  తొలి పాట‌ను  నిర్మాత దిల్ రాజు విడుద‌ల చేశారు.  విశ్వ‌నాథ్ రాసిన ఈ పాట‌ను హ‌రిచ‌ర‌ణ్ ఆల‌పించారు. 

ఈ సందర్భంగా దిల్‌రాజు మాట్లాడుతూ -  మంచి మెలోడీ సాంగ్‌. ఫీల్ గుడ్ సాంగ్‌, అంద‌రికీ న‌చ్చుతుంది. క‌మ‌ల్‌హాస‌న్‌గారి `గుణ‌`.. బాల‌కృష్ణ‌గారి `ఆదిత్య 369` సినిమాల‌ రెండు టైటిల్స్ స‌గం స‌గం క‌లిసి చ‌క్క‌గా క‌థ‌కు త‌గ్గ‌ట్టు `గుణ 369` అనే టైటిల్  కుదిరింది. టైటిల్‌లోని 369 ఏంటో ట్రైల‌ర్‌ను చూడ‌గానే అర్థ‌మైంది. ట్రైల‌ర్ బావుంది. కార్తికేయ‌కు, టీమ్‌కు `ఆర్‌.ఎక్స్ 100`లా సినిమా పెద్ద హిట్ కావాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నాను`` అన్నారు. 

ద‌ర్శ‌కుడు అర్జున్ జంధ్యాల మాట్లాడుతూ ``ఇదేదో వండి వార్చిన క‌థ కాదు. జ‌రిగిన క‌థ‌. య‌థార్థ ఘ‌ట‌న‌ల‌ను ఆధారంగా చేసుకుని తెర‌కెక్కించాం. అత్యంత రియ‌లిస్టిక్‌గా ఉంటుంది. త‌ప్ప‌క‌ ప్ర‌తి వారికీ క‌నెక్ట్ అవుతుంది. ఇదివ‌ర‌కు సిల్వ‌ర్ స్క్రీన్ మీద‌ ఇలాంటి క‌థ రాలేదు.అలాంటి ఒరిజినాలిటీ ఉన్న క‌థ ఇది.  అని అన్నారు.

నిర్మాత‌లు అనిల్‌ కడియాల, తిరుమ‌ల్ రెడ్డి మాట్లాడుతూ ``టాలీవుడ్ లో మోస్ట్ స‌క్సెస్‌ఫుల్ ఏస్ ప్రొడ్యూస‌ర్ `దిల్‌` రాజు చేతుల మీదుగా మా `గుణ 369` చిత్రంలోని తొలి పాట విడుద‌ల కావ‌డం చాలా ఆనందంగా ఉంది . చిత్రంలోనూ యువ‌త‌కు కావాల్సిన అంశాలు, ఫ్యామిలీ కోరుకునే విష‌యాలు, మాస్ ప్రేక్ష‌కుల‌ను న‌చ్చే స‌న్నివేశాలు పుష్క‌లంగా ఉంటాయి.   ఆగ‌స్టు 2న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం`` అని అన్నారు. 

బాబు భ్రమలను నమ్మని జనం.. వికేంద్రీకరణకే జగన్‌ మొగ్గు?