గుల్లయిపోయిన 'కమ్మ' వర్గం?

పాపం, లగడపాటి జోస్యాన్ని నమ్ముకుని, ఆంధ్రలో వందల కోట్ల బెట్టింగ్ నడిచింది. ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గ జనాలు ఈ బెట్టింగ్ లో వందలకోట్లు గుల్లయిపోయారని ఆ వర్గాల నుంచే అందుతున్న బోగట్టా. లగడపాటి సర్వే కచ్చితంగా వుంటుందనే అంచనాతో బెట్టింగ్ లు మహా కూటమికి అనుకూలంగా జరిగాయి. అయితే ప్రత్యేకించి తెలుగుదేశం అంటే అభిమానం వుండే కమ్మ సామాజిక వర్గానికి చెందిన బడాబాబులు అనేకమంది కోట్లకు కోట్లు పందాలు కాసారని తెలుస్తోంది.

ఇవన్నీ కలిపి వందల కోట్ల మేరకు వుంటాయని తెలుస్తోంది. ''...మా వాళ్లు అంతా లగడపాటిని నమ్మి వందలకోట్లు నష్టపోయారు. మళ్లీ ఎన్నాళ్లో కష్టపడితే తప్ప అంత డబ్బు పోగేయలేరు. గత ఎన్నికల్లో జగన్ గెలుస్తాడని నమ్మి రెడ్లు చాలా పందాలు నష్టపోయారు. ఇప్పుడు మా వాళ్ల వంతు వచ్చింది.

నిన్న ఉదయం వరకు మహాకూటమికి అనుకూలంగా బెట్టింగ్ లు కడుతూనే వున్నారు. కానీ సాయంత్రం నుంచి ట్రెండ్ మారింది. అప్పుడు అట్నుంచి ఇటు కట్టాలన్నా, పందాలు నిర్వహించేవారు ఆపేసారు. వాళ్లకు అప్పటికే ట్రెండ్ తెలిసిపోయి వుండాలి...'' అని అదే సామాజిక వర్గానికి చెందిన ఓ వ్యక్తి చెప్పడం విశేషం.

చిత్రమేమిటంటే ఈ మాటలు చెప్పిన వ్యక్తి టీఆర్ఎస్ కు అనుకూలంగా బెట్ కాసి పదిలక్షలు గెల్చుకోవడం. మొత్తంమీద ఎన్నికల్లో పోటీచేసి ఓడినవాళ్లు మాత్రమే కోట్లు పొగొట్టుకోలేదు. తెలుగుదేశం హార్డ్ కోర్ బాడా బాబులు కూడా కోట్లు పోగొట్టుకున్నారు.

Show comments