జార్జి రెడ్డి...హంగామా ఏమిటి?

ఉన్నట్లుండి మీడియాలో బ్రేకింగ్ న్యూస్. జార్జిరెడ్డి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పోలీసులు అనుమతి నిరాకరణ. పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ కాబట్టి, జనాన్ని కంట్రోలు చేయడం కష్టమని అనుమతి ఇవ్వలేదంటూ వార్తలు. అసలు ఏం జరిగింది? ఏం జరుగుతోంది?

జార్జిరెడ్డి ఫంక్షన్ కోసం నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాలో అనుమతి కోరిన మాట వాస్తవం. కానీ లాస్ట్ మినిట్ లో ఆదివారం కాబట్టి ఫ్యామిలీలు అంతా వస్తాయి. టూరిస్ట్ లు వస్తారు కాబట్టి కష్టం అవుతుందని పోలీసులు వెన్యూ మార్చుకోమని  అడిగారని తెలుస్తోంది. 

దాంతో ఐమాక్స్ పక్కన వున్న డాక్టర్ కార్ ప్లేస్ లో పెట్టాలని అనుమతి కోరారు. అది కూడా అదే ప్రాంతం కాబట్టి అనుమతి కష్టం అవుతుందని, ఇండోర్ లో ఎక్కడైనా పెట్టుకుంటే అనుమతికి నో ప్రోబ్లమ్ అని పోలీసులు చెప్పినట్లు తెలుస్తోంది.

ఇదిలా వుంటే పవన్ కళ్యాణ్ రావడం  వల్ల అనుమతి నిరాకరించారు అన్నది కరెక్ట్ కాదని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ వస్తారా?రారా? అన్నది క్లియర్ తెలియదు. సినిమాకు సంబంధించి నాగబాబు బైట్ ఇచ్చిన మాట వాస్తవం. మెగాస్టార్ కూడా బైట్ ఇస్తారని చెప్పిన మాట కూడా వాస్తవం. 

అయితే పవన్ సంగతి తెలియదు. డైరక్టర్ స్వయంగా విజయవాడ వెళ్లి అడిగినట్లు తెలుస్తోంది. మరి పవన్ ఏమన్నారు అన్నది తెలియదు. విశ్వసనీయ వర్గాల బోగట్టా ప్రకారం పవన్ వస్తానని క్లారిటీగా చెప్పలేదని తెలుస్తోంది. 

ఇక ఇప్పుడు మరో రెండు రోజుల్ల ఇన్ సైడ్ ఆడియటోరియంలో ఫంక్షన్ ఏర్పాట్లు చేస్తున్నారు. మరి పవన్ వస్తారా?అన్నది మాత్రం అనుమానమే. ఉస్మానియా విద్యార్థులు మాత్రం భారీగా హాజరవుతారని అంచనా వేస్తున్నారు జార్జిరెడ్డి యూనిట్ జనాలు.

Show comments