ట్రెండింగ్: జార్జిరెడ్డి ట్రైలర్

ఉస్మానియా క్యాంపస్ రాజకీయాల హీరో.. వామపక్ష విద్యార్థి సంఘం ప్రతినిధి, దివంగత జార్జిరెడ్డి జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న సినిమా 'జార్జి రెడ్డి'. 'దళం' సినిమా ఫేమ్ జీవన్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ఆసక్తిని రేపుతూ ఉంది. విడుదల అయిన కొద్ది సేపటికే ఇది నెట్ ట్రెండ్స్ లో ముందుండటం విశేషం.

చిన్న వయసులోనే పెద్ద పేరు తెచ్చుకుని, పీడీఎస్ యూ స్థాపకుడుగా నిలిచిన జార్జిరెడ్డి విషాదాంత కథ ఈ సినిమా. ట్రూ ఈవెంట్స్ ను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను రూపొందించినట్టుగా రూపకర్తలు ప్రకటించారు. విద్యార్థి ఉద్యమ రాజకీయాలు ఆసక్తిదాయకంగా ఉంటాయి.

చాలా సినిమాల్లో వాటిని కొద్దిమేర వాడుకుంటూ ఉంటారు. అయితే పూర్తిస్థాయిలో అలాంటి సినిమాలు అరుదు. అందునా ట్రూ ఈవెంట్స్ ఆధారమైన సినిమా కాబట్టి మరింత ఆసక్తిదాయకంగా నిలుస్తూ ఉంది. ఈ సినిమా ట్రైలర్ ఆ మేరకు ఆసక్తిని రేపుతూ ఉంది. కాన్సెప్ట్ కు తగినట్టుగా ఉంది. ఈ సినిమా విడుదల తేదీ తదితరాలను ఇంకా ప్రకటించాల్సి ఉంది.