ఘంటశాల నాటకం అయ్యాడు...!

ఆయన గాన గంధర్వుడు. అమర గాయకుడు. పదివేలకు పైగా పాటలు తెలుగులో పాడారు. ప్రతీ పాటా ఆణిముత్యం. ప్రతీ పాట రికార్డు అయింది స్టూడియోలలో అయినా ఈ రోజుకీ అది జనం మెదళ్ళలో చెరగని ముద్ర వేసుకుని శాశ్వతంగా రికార్డు అయిపోయింది.

ఘంటశాల నాటక రంగం నుంచి వచ్చిన వారు. ఆయన సినిమా నేపధ్య గాయకుడిగా నిలదొక్కుకుని సినిమ పాట ఇలా ఉండాలని ఒక నిర్వచనం ఇచ్చిన వారు. ఘంటశాల గతించి వచ్చే ఏడాది కి యాభై ఏళ్ళు పూర్తి అవుతాయి. అయినా సరే ఆయన చిరంజీవిగానే ఉన్నారు.

ఆ మహనీయుడు పేరు మీద విగ్రహాలు ఉన్నాయి. ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. ఇటీవలే తెలుగు సినిమా ఔత్సాహీకులు అంతా కలసి సినిమా తీశారు. ఘంటసాల బయోపిక్ గా అది వచ్చింది. అయితే ఇపుడు మరో రూపంలో ఘంటశాల జనాల ముందుకు వస్తున్నారు. ఆయన జీవిత చరిత్రను నాటకంగా మలచి ప్రఖ్యాత సురభి కళాకారులతో అద్భుతమైన దృశ్య రూపకాన్ని తయారు చేశారు. విశాఖపట్నంలోని కళాభారతి వేదికగా ఈ నెల 28న ఈ నాటకం ప్రదర్శించబోతోంది.

ఒకటి కాదు రెండు ప్రదర్శనలుగా వరసగా అదే రోజు ఈ నాటకాన్ని ప్రదర్శిస్తున్నారు అంటే వచ్చిన ఆదరణ, ప్రేక్షకుల నుంచి లభించిన స్పందనలే కారణం అంటున్నారు. ఘంటశాల జీవితం యాభై రెండేళ్ళు. అందులో మూడున్నర దశాబ్దాల పాటు గాయకునిగానే సాగింది. ఆయన జీవితం తెరచిన పుస్తకమే. కానీ అందులో తెలియని పుటలను అన్వేషించి మరీ చక్కని నాటకంగా మలచామని నిర్వాహకులు చెబుతున్నారు. 

గాయకుడు ఘంటశాల నాటకంగా మారి జనాలను అలరించబోతున్న అద్భుత్వ ఘట్టానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఈ నెల 28 కోసం కళాభిమానులు ఘంటశాల ప్రేమికులు ఎదురుచూస్తున్నారు.

Show comments