గ్యాంగ్ లీడర్ సెన్సారుకు సెలవుల బ్రేక్

సినిమాకు సెన్సారు కీలకం. ఇన్ టైమ్ లో రాకపోతే, ఆన్ లైన్ బుకింగ్ లు, క్యూబ్ లోడింగ్ ల వంటి వ్యవహారాలు ఇబ్బంది పడతాయి. నానీస్ గ్యాంగ్ లీడర్ కు ఇప్పుడు ఇదే సమస్య అయింది. వినాయకచవితి వరుస సెలవులు రావడం, ఈలోగా వేరే సినిమాలు లైన్ లో వుండడం, ఇంతలోనే ఆదివారం, మొహరం సెలవులు రావడంతో ఇప్పటివరకు సెన్సారు కాలేదు.

ఈరోజు అంటే బుధవారం నానీస్ గ్యాంగ్ లీడర్ సెన్సారు షెడ్యూలు అయింది. విదేశాలకు వెళ్లే ప్రింట్ లతో సమస్యలేదు. కానీ ఇక్కడ క్యూబ్ లోడింగ్ కావాలి అంటే సర్టిఫికెట్ జతచేయాలి కదా. అందువల్ల బహుశా గురువారం మధ్యాహ్నం కానీ క్యూబ్ లోడింగ్ సాధ్యం కాకపోవచ్చు.

ఎందుకంటే గతంలో మాదిరిగా సెన్సారు సర్టిఫికెట్ వెంటనే రావడంలేదు. ఆన్ లైన్, ముంబాయి నుంచి రావడం ఇలాంటివి చాలా వ్యవహారాలు వుంటున్నాయి. అయితే ఇక్కడ పాజిటివ్ పాయింట్ ఏమిటంటే, నానీస్ గ్యాంగ్ లీడర్ కు, కట్ లు, మ్యూట్ లు లాంటి వ్యవహారాలు పెద్దగా వుండవు. క్లీన్ యు మాదిరిగా వుండే అవకాశమే ఎక్కువ. అందువల్ల సర్టిఫికెట్ కాస్త త్వరగానే వస్తుందని ఆశిస్తున్నారు.

Related Stories: