గ్యాంగ్ లీడర్ డైలమా..?

గ్యాంగ్ లీడర్ గా మరో రెండురోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు హీరో నాని. ఆ తరువాత సినిమా ఆల్రెడీ షూట్ లో వుంది. ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో చేస్తున్న 'వి' సినిమా అది. దాని తరువాత ఏంటీ? అన్నది ఇప్పుడు క్వశ్చను. చుట్టూ చాలామంది దర్శకులే తిరుగుతున్నారు. నిర్మాతలకు లోటు లేదు. కానీ ఏం చేయాలా? అన్నదే సమస్యగా వుంది నానికి అని ఇండస్ట్రీ టాక్.

మజిలీ డైరక్టర్ శివనిర్వాణ ఓ కథ చెప్పారు. అది పెండింగ్ లో వుంది. వరుస ఫ్లాపులు ఇచ్చిన దర్శకుడు సుధీర్ వర్మ, హను రాఘవపూడి అవకాశం కోసం అడుగుతున్నారు. ఇంతకుమించి మరేదైనా మంచి ప్రాజెక్టు వస్తుందా అన్నదే ఆలోచన, ప్రయత్నంగా వుందని తెలుస్తోంది. సరైన హిట్ అవసరం వుంది. అందుకు తగిన డైరక్టర్, ప్రాజెక్టు కావాలి.

గత మూడు సినిమాలుగా కృష్ణార్జున యుద్దం లాంటి మాస్ ట్రయ్ చేసాడు. దేవదాస్ లాంటి మాస్ ఎంటర్ టైనర్ ట్రయ్ చేసాడు. జెర్సీ లాంటి క్లాస్ మూవీ చేసాడు. జెర్సీ తప్ప మరేదీ, ఆ మాటకు వస్తే జెర్సీ కూడా సరైన కమర్షియల్ సక్సెస్ ఇవ్వలేదు. గ్యాంగ్ లీడర్ లాంటి క్లాస్ కామెడీ ఇప్పుడు అందిస్తున్నాడు.

మరి తన తొమ్మిది కోట్ల రెమ్యూనిరేషన్ నిలబడాలి, సినిమా సక్సెస్ కావాలి అంటే ఏం చేయాలి? అదే నాని డైలమాగా ఇండస్ట్రీలో వినిపిస్తోంది.

అదొక్కటే.. జగన్ తప్పుడు నిర్ణయం