తెరాస పేరుపెట్టినోడే.. కేసీఆర్ పై ధ్వజం!

తెలంగాణ రాష్ట్రసమితి పోరాటం నుంచి ఆవిర్భవించిన పార్టీ. పోరాటం పునాదుల మీదినుంచే అధికారంలోకి వచ్చిన పార్టీ. ఇప్పుడు ఆ పార్టీ.. అసెంబ్లీని రద్దుచేసి ముందస్తు ఎన్నికలకు వెళుతోంది. ఈ సమయంలో.. కేసీఆర్ ప్రాపకాన్ని కోరుకునే రాజకీయ పక్షులు ఆయన ఏంచేస్తే దానికి తానా తందానా అనడం సహజం. కానీ అసలు పార్టీ మూలాల్లో ఉన్న పెద్దలు ఈ పరిణామాల గురించి ఏం అనుకుంటున్నారు?

కేసీఆర్ పాలన గురించి, కేసీఆర్ కుటుంబ వ్యవస్థ గురించి.. పార్టీ ఆవిర్భావంలో ఆయన వెంట కీలకంగా ఉన్న వ్యక్తులందరూ ఎలా ఫీలవుతున్నారు. వారందరూ అప్పటి పోరాట నాయకుడిలాగానే కేసీఆర్ ఇప్పటికీ స్వచ్ఛంగా ఉన్నారని అనుకుంటున్నారా? లేదా భిన్నాభిప్రాయంతో ఉన్నారా? అనేది కీలకాంశం.

నిజానికి కేసీఆర్ తో సమానంగా తెలంగాణ ప్రత్యేకరాష్ట్ర ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లిన, పోరాటం సఫలం కావడంలో కీలకభూమిక పోషించిన ప్రొఫెసర్ కోదండరాం తొలినుంచి కేసీఆర్ పాలన తీరుతో విభేదిస్తున్నారు. ఆయన ప్రస్తుతం తెజస నాయకుడిగా, కేసీఆర్ కు వ్యతిరేకంగా ఎన్నికల బరిలో దిగుతున్నారు.

ఇదిలా ఉండగా.. తాజాగా విడులైన ఒక కరపత్రం సంచలనం సృష్టిస్తోంది. గాదె ఇన్నయ్య పేరిట ప్రచురితమైన ఆ కరపత్రంలో సదరు ఇన్నయ్య తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి ఆ పేరు పెట్టిన నామకర్తగా పేర్కొన్నారు. అలాగే గులాబీజెండా రూపకర్త కూడా ఆయనే అనే విషయాన్ని అందులో పొందుపరిచారు.

ఆ ఇన్నయ్య మాత్రం కరపత్రంలో కేసీఆర్ మీద తీవ్రమైన ఆరోపణలు గుప్పించారు. పార్టీ పెట్టే నాటికి కేవలం పదిలక్షల బ్యాంక్ అకౌంట్ నిల్వ ఉన్న కేసీఆర్ ఇప్పుడు ఇరవై వేలకోట్ల రూపాయలకు అధిపతి అయ్యారంటూ ఆరోపించారు.

ఆ కరపత్రంలో ఇంకా ఇన్నయ్య ఏమేం ఆరోపించారో సవివరంగా చూడండి....

RELATED ఐక్యరాజ్యసమితిలో ఆవు కథ చెప్పిన చంద్రబాబు