ఫైటర్ లో మదర్ సెంటిమెంట్?

దర్శకుడు పూరి జగన్నాధ్ కు తన కథలకు సెంటిమెంట్ టచ్ ఇవ్వడం అంటే చాలా ఇష్టం. ఆ విదంగా సినిమాకు ఎమోషనల్ కంటెంట్ ను కూడా జోడిస్తారు.

ఇడియట్ లో అయినా, లోఫర్ లో అయినా ప్రతి సినిమాలోనూ ఏదో ఒక బాండింగ్ పెట్టి, దానికి ఎమోషనల్ కనెక్షన్ ఇస్తారు. త్వరలో స్టార్ట్ కాబోయే తన ఫైటర్ సినిమాలో కూడా మదర్ సెంటిమెంట్ జోడిస్తున్నట్లు తెలుస్తోంది.

విజయ్ దేవరకొండ హీరోగా ఫైటర్ సినిమా ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కూడా తల్లి పాత్ర కీలకంగా వుంటుందని టాక్.

వినిపిస్తున్న మరో విషయం ఏమిటంటే, పూరి జగన్నాధ్ నిజ జీవితంలో తన తల్లి పాత్రను స్ఫూర్తిగా తీసుకుని, ఈ పాత్రను డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.

సినిమాలో హీరో పాత్రకు నత్తి వుంటుందని ఇప్పటికే వెల్లడయింది. తల్లి సెంటి మెంట్ కీలకం కనుక, దానికి సీనియర్ నటి రమ్యకృష్ణను కానీ ఆ రేంజ్ హీరోయిన్ ను ఎవరినైనా తీసుకుంటారని తెలుస్తోంది.

Show comments