ఎఫ్ 2.. బోణీ బాగుంది

వెంకటేష్-వరుణ్ తేజ్-తమన్నా, మెహరీన్ ల కాంబినేషన్ లో మాంచి అంచనాల నడుమ విడుదలైన అనిల్ రావిపూడి సినిమా ఎఫ్ 2. ఈ సినిమాకు తొలిరోజే మంచి టాక్ వచ్చింది. అంచనాలకు తగినట్లే తొలిరోజు మంచి కలెక్షన్లు నమోదు చేసింది. దాదాపు అయిదు కోట్ల మేరకు వసూళ్లు వుండడం విశేషం.

ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో దగ్గర దగ్గర ముఫైకోట్ల మేరకు మార్కెట్ చేసారు. వీటిలో ఉత్తరాంధ్ర, నైజాం కలిపి దాదాపు 12 కోట్ల వరకు నిర్మాత దిల్ రాజు నైజాం, వైజాగ్ తీసుకున్నారు. మిగిలినవి ఇచ్చేసారు. ఇప్పడు ఫస్ట్ కలెక్షన్లు బాగా వుండం, మంచి టాక్ వుండడంతో యూనిట్ ఆనందానికి అవదులు లేవు.

తొలిరోజు కలెక్షన్లు ఇలా వున్నాయి.
నైజాం.......................1.73
సీడెడ్.......................0.52
ఉత్తరాంధ్ర................0.56
ఈస్ట్..........................0.63
వెస్ట్..........................0.36
కృష్ణ.........................0.40
గుంటూరు..................0.39
నెల్లూరు.....................0.16

తేలని అభ్యర్థుల ఎంపిక.. పవన్ కల్యాణ్ పనే హాయి!

NTR బయోపిక్ గురించి తెలియని విషయాలు

Show comments