ఎక్స్ క్లూజివ్ - పవర్ స్టార్ సినిమాలో అంజలి

తెలుగమ్మాయి అంజలి ని మంచి చాన్స్ వరిస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో నటించే అవకాశం వెదుక్కుంటూ వస్తోంది. పింక్ సినిమాను తెలుగులో పవన్ కళ్యాణ్ హీరోగా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఈ రోజు నిర్మాత దిల్ రాజు ఆఫీసులో లాంఛనంగా ప్రారంభమయ్యాయి. సంగీత దర్శకుడు థమన్, డైరక్టర్ వేణు శ్రీరామ్, నిర్మాత దిల్ రాజు కలిసి మ్యూజిక్ సిటింగ్స్ ప్రారంభించారు.

జనవరి 10 నుంచి సినిమా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఫిబ్రవరి నుంచి పవర్ స్టార్ సెట్ మీదకు వస్తారని వార్తలు వున్నాయి. ఇదిలా వుంటే ఈ సినిమాలోని ముగ్గురు అమ్మాయిల పాత్రలకు గానూ, ఇప్పటికే నివేథా థామస్ పేరు బయటకు వచ్చింది. అఫీషియల్ గా కన్ ఫర్మ్ చేయకపోయినా, నివేథా వున్నట్లే. ఇప్పుడు ఇంకో అమ్మాయిగా అంజలిని తీసుకుంటున్నారని తెలుస్తోంది.

ఇంకా మూడో అమ్మాయి క్యారెక్టర్ ఎవరు అన్నది తెలియాల్సి వుంది. ఈ సినిమాను సమ్మర్ స్పెషల్ గా విడుదల చేయాలన్నది నిర్మాత దిల్ రాజు సంకల్పం. పవన్ కళ్యాణ్ డేట్ లు, షూటింగ్ బట్టి విడుదల ఆధారపడి వుంటుంది. మొత్తం మీద పవన్ కళ్యాణ్ తో సినిమా తీయాలన్న దిల్ రాజు కోరిక ఇన్నాళ్లకు తీరుతోంది.

Show comments