ఎక్స్ క్లూజివ్- చిరు-చరణ్-కొరటాల

మెగా ఫ్యాన్స్ కు ఇది మాంచి విందుభోజనం లాంటి వార్త. తెలుగులో మెగా మల్టీస్టారర్ లాంటి వార్త. మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి ఒకే సినిమాలో. ఈ విషయం నిన్నటికి నిన్నే మెగాస్టార్ నోటి వెంట వచ్చింది. అయితే అంతా లూసిఫర్ రీమేక్ అని, తివిక్రమ్ డైరక్టర్ అని గాలి వార్తలు వండేసారు.

కానీ అది కాదు విషయం. కొరటాల శివ డైరక్షన్ లో మెగాస్టార్ చేయబోయే సినిమాలోనే రామ్ చరణ్ కూడా నటించనున్నారు. అయితే ఇది ఫుల్ లెంగ్త్ పాత్ర కాదు. అలా అని చిన్న పాత్ర కాదు. నిడివి ఎక్కువే వుండే పాత్ర.

మరిన్ని విషయాలు ఇంకా బయటకు రావాల్సి వుంది. ఎక్స్ క్లూజివ్ సినిమా విశేషాలు ఎక్స్ క్లూజివ్ గా అందించే గ్రేట్ ఆంధ్రలో ఈ సినిమా గురించి మరిన్ని విశేషాలు ముందు ముందు వస్తూనే వుంటాయి. వెయిట్ అండ్ వాచ్.

మెగాస్టార్ 152వ సినిమా ఓపెనింగ్ ఫొటోస్ కోసం క్లిక్ చేయండి

జగన్‌ లో పరిణితి.. చంద్రబాబులో అసహనం