ఎక్స్ క్లూజివ్-బాలయ్య సరసన కేథరిన్

బాలయ్య-బోయపాటిల 70 కోట్ల ప్రాజెక్టు హడావుడి ప్రారంభమైన సంగతి తెలిసిందే. సింహా, లెజెండ్ సినిమాల తరువాత ఈ కాంబినేషన్ మళ్లీ ఇదే. అందుకే బోయపాటి చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్నారు. 70 కోట్ల ఖర్చు అయినా ఫరవాలేదు అనే రేంజ్ లో సినిమా నిర్మాణానికి దిగుతున్నారు నిర్మాత మిరియాల రవీందర్ రెడ్డి. కానీ మార్కెట్ అంత లేదన్న విషయం అందరికీ తెలుసు. అది వేరే సంగతి.

ఇంతకీ ఇప్పుడు విషయం ఏమిటంటే, ఈ సినిమాలో బాలయ్య సరసన కేథరిన్ కథానాయికగా నటించబోతోంది. బోయపాటి సినిమాలో కేథరన్ ఇంతకు ముందు కూడా రెండుసార్లు నటించింది. అందుకే ఆమె బాలయ్య సరసన నటించడానికి వెంటనే ఓకె చెప్పినట్లు సమాచారం.

సాధారణంగా బాలయ్యకు హీరోయిన్లు దొరకడం కష్టం. పైగా కాస్త పాపులర్ హీరోయిన్లు దొరకరు. అలాంటిది ఈసారి కేథరిన్ సెట్ కావడం అంటే అది బోయపాటి మహిమ తప్ప వేరుకాదు.

ఇదిలా వుంటే సినిమా ఇలా పూజ అయిందో లేదో, అలా నెగిటివ్ ప్రచారం షురూ కావడంపై బోయపాటి చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారని బోగట్టా. అర్జెంట్ గా మీడియా మేనేజ్ మెంట్ స్టార్ట్ చేయాలని ఆయన తన టీమ్ తో సమాలోచనలు ప్రారంభించినట్లు తెలుస్తోంది.

Show comments