ప్రభాస్ హీరోయిన్ పెళ్లికి రెడీ

ప్రభాస్ సరసన సాహో సినిమాలో నటించిన ఎవ్లీన్ శర్మ, తన లవ్ ఎఫైర్ ను బయటపెట్టింది. మొన్నటివరకు తనపై వచ్చిన డేటింగ్ పుకార్లను కొట్టిపారేసిన ఈ ముద్దుగుమ్మ, ఈసారి ఏకంగా నిశ్చితార్థం చేసుకుంది. అలా తనపై వచ్చిన డేటింగ్ రూమర్లకు ఓ తియ్యటి సమాధానం చెప్పింది.

ఆస్ట్రేలియాలో డెంటల్ సర్జన్ గా పనిచేస్తున్న తుషాన్ ను పెళ్లాడేందుకు ఎవ్లీన్ రెడీ అయింది. ఈ మేరకు తుషాన్ కు తనకు ఎంగేజ్ మెంట్ పూర్తయినట్టు ప్రకటించింది ఎవ్లీన్. దీనికి సంబంధించి ఆమె కొన్ని ఫొటోలు కూడా పోస్ట్ చేసింది. ఇంతకంటే రొమాంటిక్ జీవితం ఇంకేముంటుంది అనే క్యాప్షన్ తో సిడ్నీ బ్రిడ్జి వద్ద తుషాన్ ను ముద్దాడే ఫొటోను పోస్ట్ చేసింది ఎవ్లీన్.

ఆస్ట్రేలియాకు చెందిన తుషాన్ కేవలం డెంటల్ సర్జన్ మాత్రమేకాదు, ఔత్సాహిక వ్యాపారవేత్త కూడా. దాదాపు ఏడాదిన్నరగా ఇతడితో డేటింగ్ చేస్తోంది ఎవ్లీన్. ఓవైపు సినిమాల్లో నటిస్తూనే, టైమ్ దొరికినప్పుడల్లా ఆస్ట్రేలియాకు వెళ్లిపోయేది ఈ భామ. దీంతో ఎవ్లీన్ పై మీడియా అనుమానాలు వ్యక్తంచేసింది. తనకు ఆస్ట్రేలియా అంటే ఇష్టమని మాత్రమే చెప్పుకొచ్చిన ఎవ్లీన్, ఎట్టకేలకు ఆ సీక్రెట్ ను ఇలా ఎంగేజ్ మెంట్ ద్వారా బయటపెట్టింది.

2012 నుంచి బాలీవుడ్ లో కొనసాగుతోంది ఎవ్లీన్ శర్మ. అయితే ఆమెకు అంతగా గుర్తింపు రాలేదు. రీసెంట్ గా చేసిన సాహో సినిమా బాలీవుడ్ లో హిట్ అవ్వడంతో ఎవ్లీన్ కు మరోసారి క్రేజ్ వచ్చింది. అదే ఊపులో ఆమె మరిన్ని సినిమాలు చేస్తుందని ఊహించిన ప్రేక్షకలకు, ఇలా నిశ్చితార్థం చేసుకొని షాక్ ఇచ్చింది. 

చంద్రబాబుకు ఎందుకు రుచించడం లేదు