ఎవరు సినిమాకు ఏదీ ఆధారం?

క్షణం లాంటి హిట్ సినిమాను అందించిన కాంబినేషన్ పివిపి-అడవి శేష్. మళ్లీ ఇప్పుడు అదే పివిపి నిర్మాణంలో అడవి శేష్ చేస్తున్న సినిమా ఎవరు. రెజీనా కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకు వెంకట్ రాంజీ తొలిసారి దర్శకత్వం వహిస్తున్నారు. హర్రర్ టచ్ వున్న థ్రిల్లర్ సబ్జెక్ట్ తో ఈ సినిమా రూపొందుతున్నట్లు తెలుస్తోంది.

ఇదిలావుంటే ఎవరు సినిమాకు ఓ స్పానిష్ సినిమా ఆధారం అని తెలుస్తోంది. స్పానిష్ సినిమా 'ది ఇన్ విజిబుల్ గెస్ట్ ' స్ఫూర్తితో ఎవరు సినిమా కథ తయారుచేసుకున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఇదే సినిమా స్ఫూర్తితో ఆ మధ్య బాలీవుడ్ లో అమితాబ్-తాప్సీ కాంబినేషన్ లో 'బద్ లా' సినిమా వచ్చింది. ఆ సినిమాకు క్రిటిక్స్ మంచి ప్రశంసలు కూడా లభించాయి.

ఎవరు సినిమా ఆగష్టు మూడోవారంలో విడుదల కావాల్సివుంది. కానీ సాహో వాయిదాతో డేట్ ను ముందుకు జరిపారు.

మళ్ళీ ఆత్మగౌరవం నినాదం.. మారానని ప్రచారం

Advertising
Advertising