ఎవరా కోన్ కిస్కా గొట్టంగాళ్లు?

కమెడియన్ ఆలీకి కోపం వచ్చింది. ఆయన ఈ మధ్యకాలంలో కాస్త కీలకపాత్ర వేసిన రాజుగారి గది 3 సినిమాకు సరైన సమీక్షలు రాలేదని గోప్ప కోపం వచ్చేసింది. ఆయన భ్రమరాంబలో ఫ్యామిలీతో సినిమా చూసారట. టికెట్ డబ్బులు పెట్టి కొన్నవాళ్లు పడీ పడీ నవ్వారట.

ప్రివ్యూలకు ఫ్రీగా వచ్చి, నవ్వకుండా మూతి బిగించుకుని సినిమా చూసేవాళ్లు, ఇష్టం వచ్చినట్లు మాట్లాడేవాళ్లు, అంటూ ఇన్ డైరక్ట్ గా మీడియా మీద విరుచుకుపడిపోయారు. ఆయన మాత్రం డబ్బులు పెట్టి టికెట్ కొని చూసారా? నిర్మాత టికెట్ లు పంపిస్తేనే కదా సినిమా జనాలు చూసేది.

కోన్ కిస్కా గొట్టంగాళ్లు, వీళ్లెవరు సినిమా గురించి చెప్పడానికి అంటూ ఆలీ తన చిత్తానికి నోరు పారేసుకున్నారు. సరే, ఆయన అభిప్రాయం ఆయన ఇష్టం. కానీ ఒక విషయం గమనించాలి. అంతిమంగా మాట్లాడేది కమర్షియల్ సక్సెస్ నే.

రాజుగారి గది వన్ అనుకోని హిట్. అలా కాకపోయి వుంటే రెండోపార్ట్ ను కూడా సాయి కొర్రపాటినే సమర్పించడమో, నిర్మించడమో చేసి వుండేవారు. రాజుగారి గది 2 సంగతేమిటి? నిర్మాత పివిపి హ్యాపీయేనా? మరి మూడోభాగం ఆయనెందుకు నిర్మించలేదు?

సరే మూడో భాగాన్ని ఓంకార్ నే స్వయంగా నిర్మించాల్సి వచ్చింది. ఈ సినిమా ఫస్ట్ కాపీ 7 కోట్లకు పైగా పెట్టి కొన్న వరంగల్ శ్రీను ఏ నష్టంలేకుండా బ్రేక్ ఈవెన్ అయిపోవాలి. ముందు ఆ సంగతి చూస్తే బెటర్. ఆ తరువాత ఎవర్ని ఎన్ని తిట్లు అయినా తిట్టొచ్చు.

Show comments

Related Stories :