వినయ విధేయ రామలో సెక్సీ సుందరి

ఈషా గుప్తా.. ఈ ముద్దుగుమ్మకు సినిమాలు తక్కువ, ఫొటోషూట్లు ఎక్కువ. గూగుల్ లో ఈమె పేరు సెర్చ్ చేస్తే, సంప్రదాయంగా ఉండే ఫొటో ఒక్కటంటే ఒక్కటి కూడా కనిపించదు. అన్నీ హాట్ స్టిల్సే. అలాంటి హాట్ బేబ్ ను వినయ విధేయ రామ సినిమా కోసం తీసుకున్నారు. బోయపాటి డైరక్ట్ చేస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన ఓ ఐటెంసాంగ్ లో చిందేయబోతోంది ఈ బ్యూటీ.

మొన్నటివరకు ఈ ఐటెంసాంగ్ రేసులో రకుల్, కాజల్, క్యాథరీన్ లాంటి పేర్లు వినిపించాయి. వీళ్లలోంచి క్యాథరీన్ ను దాదాపు ఫిక్స్ చేశారు. ఎందుకంటే ఈ ముద్దుగుమ్మ ఆల్ మోస్ట్ బోయపాటి ఆస్థాన హీరోయిన్ గా మారింది కాబట్టి. కానీ ఆఖరి నిమిషంలో క్యాథరీన్ ను కూడా తప్పించి ఈషా గుప్తాకు ఆ ఛాన్స్ ఇచ్చారు.

14వ తేదీ నుంచి అన్నపూర్ణ స్టుడియోస్ లో ఈ ఐటెంసాంగ్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది. నిజానికి సినిమాలో ఇదొక పబ్ సాంగ్. అందుకే స్టుడియోస్ రిచ్ లుక్ ఉట్టిపడేలా ఓ పబ్ సెట్ వేశారు. ఈ సెట్ లోనే ఈషా-చరణ్ ఆడిపాడబోతున్నారు.

ఈ ఐటెంసాంగ్ తో పాటు సినిమాకు సంబంధించి మరోపాట పెండింగ్ లో ఉంది. అదొక డ్యూయెట్. ఆ పాటను హైదరాబాద్ శివార్లలోని ఖానాపూర్ లో తీస్తారు. 22 నాటికి ఈ రెండు పాటల్ని కంప్లీట్ చేయబోతున్నారు.

దీంతో టోటల్ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిపోతుంది. సంక్రాంతి కానుకగా వినయ విధేయ రామ సినిమాను విడుదల చేయబోతున్నారు. 

Show comments