ఈసారి మాస్ కూడా ట్రై చేస్తున్నాడు

కుటుంబ కథా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ సతీష్ వేగేశ్న. శతమానం భవతి, శ్రీనివాసకల్యాణం లాంటి సినిమాలు ఈ దర్శకుడి అభిరుచిని చెబుతాయి. అలాంటి దర్శకుడు కాస్తా ఇప్పుడు మాస్ ట్రై చేస్తున్నాడు. అవును.. కల్యాణ్ రామ్ హీరోగా సతీష్ వేగేశ్న తెరకెక్కిస్తున్న ఎంత మంచివాడవురా సినిమాలో మాస్ ఎలిమెంట్స్ కూడా పుష్కలంగా ఉన్నాయంటున్నారు. ఈ మేరకు ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.

ఈ సినిమాకు సంబంధించి తూర్పుగోదావరి జిల్లా పెండ్యాలలోని ఇసుక ర్యాంప్ ల మధ్య భారీ యాక్షన్ ఎపిసోడ్ తీశారు. వంగలపూడి వద్ద గోదావరి నదిలో 16 బోట్ల సాయంతో క్లయిమాక్స్ పార్ట్ చిత్రీకరించారు. ఈ షెడ్యూల్ కు సంబంధించిన స్టిల్ ను తాజాగా విడుదల చేశారు. కంప్లీట్ యాక్షన్ లుక్ లో కల్యాణ్ రామ్ కనిపిస్తున్నాడు.

ఈ షెడ్యూల్ ఈనెల 25 వరకు నడుస్తుంది. తర్వాత షెడ్యూల్ అక్టోబర్ 9 నుంచి హైదరాబాద్ లో ఉంటుంది. ఆ తర్వాత కేరళ, కర్నాటకలో మరో షెడ్యూల్ ప్లాన్ చేశారు. దీంతో టోటల్ సినిమా షూటింగ్ కంప్లీట్ అవుతుంది. మూవీని సంక్రాంతి కానుకగా జనవరి 15న విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాకు గోపీసుందర్ సంగీతం అందిస్తున్నాడు.

వ్యాపారం కోసం ప్రమాణాలకు తిలోదకాలు

Show comments