ఎన్ని బుర్రల కథలో..?

ఎక్కడో ఓ పాయింట్ ఎవరికో తడుతుంది. లేదా దొరుకుతుంది. దాంతో ఇక అంతా దానివెంటే పడతారు. అందరి కన్నా ఒక బుర్ర.. రెండు మెదడులు అనే కాన్సెప్ట్ రచయిత రత్నంకు దొరికింది. ఆయన కథ అల్లి హీరో, నిర్మాతల కోసం తిరుగుతుంటే, దర్శకుడు చందు మొండేటి రెడీ అయిపోయారు. సవ్యసాచి అంటూ ఆయన స్టయిల్ లో ఆయనో కథ వేసుకున్నారు.

ఇదిలావుంటే లాజికల్ గా వుండాలనే ఉద్దేశంతో దానికి ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ చిప్స్ వంటి వ్యవహారాలు జోడించి పూరి జగన్నాధ్ ఇస్మార్ట్ శంకర్ అంటూ ముందుకు వచ్చారు. ఇదిలావుంటే ఇంక రెడీ కాని సినిమా ఒకటి వుంది. శ్రీవిష్ణు సినిమా తిప్పరా మీసం.

ఈ సినిమాకు కూడా రెండు మెదడుల కాన్సెప్ట్ నే కీలక ఆధారం అని తెలుస్తోంది. మొత్తానికి ఒక బుర్ర.. రెండు మెదడులు అన్న కాన్సెప్ట్ మన సినిమా జనాలకు బాగా పట్టేసినట్లుంది. ఎవరి కథలు వారు అల్లేసుకుంటున్నారు.

చంద్రబాబు వ్యూహాలే ఇప్పుడు ఆయనకు పాశాలా

Show comments