ఈ రూలర్ మహా మాస్ గురూ

బాలయ్య సినిమా అంటే ఏమిటి? దబిడి దిబిడే. రూలర్ టీజర్ కూడా అదే చెబుతోంది. బాలయ్య సినిమాతో పెట్టుకుంటే ఖబడ్దార్ అనేలాంటి లెంగ్తీ టీజర్ కట్ చేసి వదిలారు.

టీజర్ చివర్న ఖబడ్దార్ అనే వార్నింగ్ కూడా పడేసారు. టీజర్ మొత్తం అందరికీ అలవాటైపోయిన బాలయ్య వ్యవహారాలతో నిండిపోయింది. భారీ స్టార్ కాస్ట్ కనిపిస్తోంది. 

పనిలో పనిగా బాలయ్య సినిమా అంటే ఇలాంటి కథే వుండాలి అనేలాంటి కథ, ఇలాంటి సీన్లే కదా కావాల్సింది అనేలాంటి సీన్లు, అన్నీ కలిపి దట్టించారు. అందరికీ తెలిసినట్లే బాలయ్య రెండు షేడ్స్ లో కనిపించారు.

ఒక షేడ్ లో కాస్త కొత్తగా వున్నారు కానీ పోలీస్ అధికారి షేడ్ లో మాత్రం బాలయ్యను బాగా చూపించలేకపోయారు. ముఖ్యంగా టోపీ తీస్తే మధ్య పాపిడితో చేసిన విగ్ కాస్త ఇబ్బందిగానే కనిపిస్తోంది.

బోలెడు మంది నటులు, భారీ ఖర్చు పక్కాగా టీజర్ కట్ లోనే తెలుస్తోంది. కేఎస్ రవికుమార్ రూలర్ గా బాలయ్యతో ఏం కథ చెప్పబోతున్నారో తెలియాలి అంటే నెల రోజులు ఆగాల్సిందే.

Show comments