ఈ 'కలుపుడు ఫోన్'లు ఏల అరవిందా?

పెద్ద హీరోల సినిమా కలెక్షన్లు అంటే పెద్ద మాయాజాలం. బయటకు వచ్చే ఏ ఫిగర్ కూడా కరెక్ట్ కాదు. డిసిఆర్ లు థియేటర్ల వాళ్లకు, డిస్ట్రిబ్యూటర్లకు, నిర్మాతకు తప్ప మరెవరికీ తెలియదు. ఇన్ కమ్ టాక్స్ జనాలకు ఇచ్చే లెక్కలు వేరుగా వుంటాయి. సాధారణంగా పెద్దహీరోల సినిమాలకు పీఆర్వోల రేంజ్ లో, అభిమానుల లెవెల్ లో కొంత 'కలుపుడు' వుంటుంది. అది తప్పదు. అది ఏ హీరో అయినా కామన్. దీనికి ఎవరూ అతీతం కాదు. అయితే అరవింద సమేత వీరరాఘవకు మరో చిత్రమైన వ్యవహారం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఎవరికోసం రంగప్రవేశం చేసారో? ఎందుకోసం రంగప్రవేశం చేసారో కానీ, నిర్మాతలు సీన్ లోకి ఎంటర్ అయినట్లు తెలిసింది. తొలిరోజు కలెక్షన్ల మీద అటు ఎన్టీఆర్ ఫ్యాన్స్, ఇతర హీరోల ఫ్యాన్స్, మీడియా జనాలు కన్నేసారు. ఉదయాన్నే కలెక్షన్లు సంపాదించి సోషల్ మీడియాలో పెట్టేసారు. అదే సమయంలో ఇటు ఫేక్ కలెక్షన్లు, అటు రియాల్టీకి కాస్త దగ్గరగా వుండే కలెక్షన్లు రెండూ హడావుడి చేసాయి.

దీంతో నిన్న రాత్రికి రాత్రి అరవింద నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లు అందరికీ ఫోన్ లు చేసినట్లు తెలిసింది. ప్రతి డిస్ట్రిబ్యూటర్ కు డైరక్ట్ గా ఫోన్ చేసి, ఒరిజినల్ ఫిగర్లు చెప్పవద్దని, కనీసం పది నుంచి పదిహేను శాతం కలిపి చెప్పమని రిక్వెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఓ డిస్ట్రిబ్యూటర్ కన్ ఫర్మ్ చేసారు కూడా. సాధారణంగా ఇలా ఫ్యాన్స్ అడుగుతారని, నిర్మాత అడగడం తొలిసారి అని ఆ డిస్ట్రిబ్యూటర్ కామెంట్ చేయడం విశేషం.

వాస్తవానికి ఆంధ్రలో టికెట్ రేట్లు పెంచడం అన్నది రెండు విధాలుగా పనిచేసింది. వీక్ డే అయిన శుక్రవారం కలెక్షన్లు డ్రాప్ అయినా ఈ రేటు పెంపు చాలావరకు కవర్ చేసింది. కానీ అదే సమయంలో రెండు వందల వల్ల థియేటర్ కు రావాల్సిన వారు థియేటర్లకు వచ్చి మళ్లీ వెనక్కు వెళ్లడం అన్నది చాలాచోట్ల జరిగిందని, ఇద్దరు డిస్ట్రిబ్యూటర్లు తెలిపారు. 

మొత్తంమీద రెండోరోజు యావరేజ్ ఆడియన్ ఫ్లో వుంది అరవిందకు. కానీ రేటు పెంపువల్ల షేర్ చాలావరకు ఫరవాలేదు.

Show comments