దేవరకొండ కోసం దొరసాని ఎదురుచూపు!

విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ, రాజశేఖర్ రెండో కూతురు శివాత్మిక హీరోహీరోయిన్లుగా పరిచయమౌతూ తెరకెక్కుతున్న సినిమా దొరసాని. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాను సైలెంట్ గా పూర్తిచేస్తున్నారు. సినిమా షూటింగ్ కూడా దాదాపు పూర్తయింది. అయినా ప్రమోషన్ మొదలుపెట్టలేదు. దీనికి కారణం విజయ్ దేవరకొండ.

అవును.. విజయ్ దేవరకొండ కోసం దొరసాని యూనిట్ ఎదురుచూస్తోంది. అతడు ఎప్పుడు టైమ్ ఇస్తే అప్పుడు సినిమా ప్రమోషన్ ను షురూ చేయాలని చూస్తున్నారు. తమ్ముడు ఆనంద్ అరంగేట్రం చేస్తున్న సినిమాకు ప్రమోషన్ ఇవ్వడానికి విజయ్ దేవరకొండ కూడా సిద్ధమే. కాకపోతే ప్రస్తుతం నడుస్తున్న షెడ్యూల్స్ వల్ల టైం కేటాయించలేకపోతున్నాడు.

మరోవైపు కూతురు సినిమాను ప్రమోట్ చేయడానికి హీరో రాజశేఖర్ కూడా సిద్ధంగా లేడు. ప్రస్తుతం ఇతడు కల్కి సినిమాతో బిజీగా ఉన్నాడు. సో.. అటు విజయ్ దేవరకొండ, ఇటు రాజశేఖర్ ఇద్దరూ ఫ్రీ అయిన తర్వాత దొరసాని సినిమా ప్రచారాన్ని స్టార్ట్ చేస్తారు. అప్పటివరకు ఈ మూవీకి సంబంధించి కనీసం ఫస్ట్ లుక్ కూడా విడుదల చేయకూడదని నిర్ణయించుకున్నారు మేకర్స్.

మహేంద్ర డైరక్ట్ చేస్తున్న ఈ సినిమాను మధుర శ్రీధర్, యష్ రంగినేని నిర్మిస్తున్నారు. తాజాగా సురేష్ బాబు కూడా వచ్చి చేశారు. ఆమధ్య వరంగల్ లో సినిమాకు సంబంధించి భారీ షెడ్యూల్ పూర్తిచేశారు. తర్వాత సిద్ధిపేటలో మరో షెడ్యూల్ కంప్లీట్ చేశారు. దొరసాని దాదాపు 90శాతం పూర్తయింది. 

ప్రజలు చంద్రబాబు కన్నా తెలివైన వారు!

అంతా అనైతికం, చెప్పేవి మాత్రం నీతులు