బాబు నామినేషన్ కోసం బిచ్చమేయాలట!

ఒకవైపు అఫిడవిట్ లో ఏడు వందల కోట్ల రూపాయల ఆస్తులను డిక్లేర్డ్ చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. తనపేరిట, తన భార్య పేరిట ఏడువందల కోట్ల రూపాయల ఆస్తులున్నట్టుగా బాబు ప్రకటించుకున్నారు.

నారాలోకేష్, ఆయన భార్య, దేవాన్ష్ పేరిట ఉన్న ఆస్తుల కథ వేరే. ఆ ఆస్తులు దాదాపు మూడువందల డెబ్బై ఐదుకోట్ల రూపాయల వరకూ ఉన్నాయి. స్థూలంగా నారా కుటుంబ ఆస్తులు వెయ్యి కోట్ల రూపాయల పైనే! వీటి మార్కెట్ విలువ వేరే.

గత ఐదేళ్లలో రెండు రోజులకు ఒక కోటి రూపాయల చొప్పున నారా కుటుంబ ఆస్తులు పెరిగాయి. రోజుకు యాభై లక్షల రూపాయల చొప్పున వీరి కుటుంబ ఆస్తి విలువ పెరిగింది. అధికారంలో ఉండగా.. బాబు కుటుంబ సంపాదన ఈ స్థాయిలో గ్రోత్ నమోదు అయ్యింది. పెరిగిన ఆస్తి విలువే గంటకు రెండు లక్షల రూపాయల చొప్పున ఉంది!

ఇదీ బాబుగారి ఆస్తుల లీల. మరి వెయ్యికోట్ల రూపాయల పైనే ఆస్తున్నాయని అఫిడవిట్లో పేర్కొన్న చంద్రబాబుకు నామినేషన్ డబ్బుల కోసం మాత్రం బిచ్చం కావాలట! దీనికోసం ప్రజలు విరాళాలు ఇవ్వాలట. ఈ మేరకు కుప్పంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బిందెలు పట్టుకుని తిరుగుతూ ఉన్నారు.

రూపాయి, అర్ధరూపాయి వేయాలని.. బాబు నామినేషన్ కు నిధిని సమకూర్చాలని వారు జోలె పడుతున్నారు. బిందెలు చూపించి డబ్బులు వేయమని అడిగిన వైనం వెలుగులోకి వస్తోంది! అన్ని వేలకోట్ల రూపాయల ఆస్తులున్న ఆసామికి ఇలా నామినేషన్ కోసం కూడా మళ్లీ జనాల దగ్గర జోలె పట్టడం విశేషం.

ఆ బిందెలను నింపడానికి కాంట్రాక్టర్లు ముందుకు వచ్చారట. అయినా.. దీన్నో పొలిటికల్ డ్రామాగా మార్చి.. సామాన్యుల జేబులకు కూడా కన్నంపెట్టే రాజకీయాన్ని చేస్తూ ఉన్నారు. వెయ్యి కోట్ల రూపాయల స్థాయి ఆస్తుల డిక్లరేషన్ చేసిన వ్యక్తి కోసం ఇలా జోలెపడితే.. దాన్ని ఏమనాలి అసలు?

అప్నా టైం ఆయేగా సాబ్ 

చెట్టు పేరుతో ఓట్లు అడుక్కోవడం.. ఎన్నాళ్లిలా 

Show comments