సీఈసీలో విబేధాలు? చంద్రబాబు స్కెచ్చా..!

తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడును తక్కువ అంచనా వేయకూడదని పరిశీలకులు అంటారంటే అదేమీ ఉత్తుత్తి మాటకాదని ఈ ఉదంతం గురించి సమాచారం అందించిన వర్గాలు అంటున్నాయి! చంద్రబాబు నాయుడు ఏకంగా కేంద్ర ఎన్నికల కమిషన్లోనే చిచ్చుపెట్టిన ఘనుడు అని ఢిల్లీ వర్గాల్లో ఇప్పుడు ముమ్మరంగా ప్రచారం సాగుతూ ఉంది. ఈ వ్యవహారం తర్వాతే చంద్రబాబు నాయుడును కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా చాలా సీరియస్ గా తీసుకుంటోందట. 

ఇటీవల చంద్రబాబు నాయుడు హర్రీబర్రీగా ఢిల్లీ వెళ్లడం అక్కడ, అక్కడ చంద్రగిరి రీపోలింగ్ వ్యవహారంపై ఆక్షేపణ తెలపడం తెలిసిన సంగతే. అక్కడ రీపోలింగ్ ఎలా నిర్వహిస్తారంటూ చంద్రబాబు నాయుడు సీఈసీనే నిలదీశారట. అయితే చంద్రబాబుకు చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని కొన్ని బూత్ లలో పోలింగ్ జరిగిన తీరు గురించి వీడియోలను చూపించి.. వాళ్లు పంపించేశారట!

మరి చంద్రబాబు నాయుడు అక్కడకు వెళ్లేసరికి ఆ వీడియోలను వాళ్లు ఎందుకు రెడీగా పెట్టుకున్నారు? అంటే.. అంతకు ముందు కూడా కొన్ని పరిణామాలు జరిగాయని, వాటిని ఆధారంగా చేసుకుని చంద్రబాబును ఎదుర్కొనేందుకు సీఈసీ అన్ని ఏర్పాట్లనూ చేసుకుందని కేంద్ర ఎన్నికల కమిషన్లోని కొన్నివర్గాలు చెబుతున్నాయి.

ఆఖరికి కేంద్ర ఎన్నికల కమిషన్లో చిచ్చుపెట్టిన వ్యక్తి మరెవరో కాదు చంద్రబాబు నాయుడే అని ఇప్పుడు ఢిల్లీలో ప్రచారం జరుగుతూ ఉండటం విశేషం. ఎన్నికల షెడ్యూల్ వెలువడక ముందే సీఈసీలోని కొంతమందిని చంద్రబాబు నాయుడు మచ్చిక చేసుకునే యత్నం చేసినట్టుగా ప్రచారం జరుగుతూ ఉంది. వారిని తాయిలాల ద్వారా చంద్రబాబు నాయుడు ఆకట్టుకునే ప్రయత్నం చేశారని, ఆ గుట్టంతా బయటపడటంతో సదరు అధికారులను సీఈసీ పక్కన పెట్టేసినట్టుగా ప్రచారం జరుగుతోంది.

అలా దెబ్బతిన్న వాళ్లే.. ఇప్పుడు సీఈసీ మీద అసహనం వ్యక్తం చేస్తున్నారని, అందుకే వారి తరఫున చంద్రబాబు నాయుడు వకల్తా పుచ్చుకుని మాట్లాడుతూ ఉన్నారని ఢిల్లీలోని సోర్సెస్ అంటున్నాయి. ఏపీలో ఎన్నికలు ఆఖరి దశలో జరగాలి, తెలంగాణ- ఏపీల్లో వేర్వేరు తేదీల్లో పోలింగ్ ఉండాలి, అధికారుల బదిలీలు జరగకూడదు.. వంటి షరతులతో సీఈసీలోని ఒక కీలక వ్యక్తిని తెలుగుదేశం పార్టీ వాళ్లు మచ్చిక చేసుకున్నారని ఢిల్లీ వర్గాలు అంటున్నాయి.

ఏపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న ఒక ఐఏఎస్ ద్వారా సీఈసీలో ఒకరిని మచ్చిక చేసుకున్నారని, కోట్ల రూపాయలు చేతులు మారడం కూడా జరిగిందని భోగట్టా. అయితే అనూహ్యంగా వ్యవహారంపై సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ కు ఫిర్యాదు వెళ్లింది. ఆధారాలు కూడా అందినట్టుగా సమాచారం. దీంతో సదరు అధికారిని సీఈసీ ఉన్నఫలంగా పక్కన పెట్టేసిందని, టీడీపీ షరతులన్నింటికీ వ్యతిరేకంగా ఎన్నికల షెడ్యూల్ వచ్చిందని ఢిల్లీలోని వర్గాలు చెబుతున్నాయి.

అలా దెబ్బతిన్నవారు ఇప్పుడు కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి మీద ఫైర్ అవుతున్నారని, సీఈసీలో విబేధాలు అంటున్నారని.. ఆ వ్యవహారాన్ని చంద్రబాబు నాయుడు హైలెట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉండటం వెనుక కూడా ఈ స్కెచ్ అంతా ఉందని ఢిల్లీలోని అభిజ్ఞవర్గాలు ఇస్తున్న సమాచారం! 

ప్రజల్లో మేరానామ్ జోకర్?!

ఎమ్బీయస్‌: బెదురు బాబు

Show comments