ఇకపై అలాంటి పనులు చేయను

ఇండస్ట్రీలో మారుతికి ఓ ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్ ను డ్యామేజ్ చేసేలా ఈమధ్య కొన్ని సినిమాలు వచ్చాయి. డబ్బు కోసం కావొచ్చు, మొహమాటం అవ్వొచ్చు.. కొన్ని సినిమాల విషయంలో మారుతి తప్పులు చేశాడు. మారుతి మార్క్ తో వచ్చిన బ్రాండ్ బాబు, లండన్ బాబులు లాంటి సినిమాలు డిజాస్టర్లు అయ్యాయి. ఇలాంటి దెబ్బలతో ఇప్పుడీ దర్శకుడు ఓ నిర్ణయానికొచ్చాడు.

"ఇకపై చిన్న సినిమాలు నిర్మించను. నాతో పాటు నా టీమ్ కు పూర్తి నమ్మకం కలిగిన తర్వాతే సినిమా నిర్మాణంలోకి అడుగుపెడతాం. తప్పులు జరుగుతున్నప్పుడు చేస్తున్న పనులు ఆపేయాలి. అందులో తప్పులేదు. నేను అదే చేయబోతున్నాను."

ఇలా ఇకపై తప్పులు చేయనంటున్నాడు మారుతి. తన దృష్టిలో చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేదంటున్న మారుతి, మనసుకు నచ్చిన కథ దొరికితే చిన్న-పెద్ద తేడా కనిపించదంటున్నాడు. కానీ మేకింగ్ విషయానికొచ్చేసరికి మనసుకు నచ్చిన కథ కూడా నచ్చడం లేదంటున్నాడు. 

"నేను ఒక కథ చెప్పినప్పుడు ఆ కథను మరో దర్శకుడు బాగా తీయగలిగితే ఓకే. అదే నేను ఓ కథను చెప్పి, మరొకరితో ఆ కథను డైరక్ట్ చేయించాలనుకోవడం కాస్త ఇబ్బంది. ఎందుకంటే మనసుకు నచ్చిన కథను మరో డైరక్టర్ చేతిలో పెట్టినప్పుడు వాళ్లతో నిత్యం మనం ట్రాలెవ్ చేయలేం కదా. కాబట్టి ఔట్ పుట్ లో తేడా రావొచ్చు. అల్టిమేట్ గా నేను బాధపడాల్సి వస్తుంది."

అందుకే ఇకపై చిన్న సినిమాలు తీయనని, తన కథల్ని మరో దర్శకుడి చేతిలో పెట్టనని కరాఖండిగా చెప్పేశాడు మారుతి. చూస్తుంటే, మారుతిపై 'బ్రాండ్ బాబు' ఎఫెక్ట్ బాగానే పడినట్టుంది. 

RELATED చంద్ర పోటు: నొప్పి తెలిసిందా పవన్‌.?