దేవీ-సుక్కూ పాటల ప్రయాణం

మ్యూజిక్ డైరక్టర్ దేవీశ్రీప్రసాద్, డైరక్టర సుకుమార్ ల స్నేహబంధం అందరికీ తెలిసిందే. అందరు డైరక్టర్లకు దేవీ ఇచ్చే ట్యూన్ లకు కాస్త ఓ మెట్టు పైనే వుంటాయి సుక్కూకు ఇచ్చే ట్యూన్ లు. రంగస్థలం పాటలు ఏ మేరకు హిట్ అన్నది యూట్యూబ్ లో రంగమ్మ.. మంగమ్మ పాట సృష్టించిన సంచలనం ఎలాంటిది అన్నది తెలిసిందే.

మళ్లీ అలాంటి సంచలనాత్మక పాటలకు ప్రాణం పోయడానికి ఈ జంట రెడీ అయిపోతోంది. స్టయిలిష్ స్టార్ బన్నీ-రష్మిక మడొన్న జంటగా మైత్రీమూవీస్ నిర్మించే సినిమాకు రంగం సిద్దం అవుతోంది. అక్టోబర్ 3న ముహుర్తం. నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్. ఈలోగా పాటల ట్యూన్ లు రెడీ చేసేయాలని సుక్కూ-దేవీ డిసైడ్ అయ్యారు.

అందుకే సుక్కూ-దేవీ ఆ ఇధ్దరి టీమ్ కలిసి విదేశాలకు ప్రయాణం అవుతున్నారు. దాదాపు రెండు వారాలు విదేశాల్లో వుండి ప్రశాంతంగా ట్యూన్ లు చేసుకుని తిరిగి రావాలన్నది ప్లాన్. ఇప్పటికే సుక్కూ మొత్తం స్క్రిప్ట్ నెరేషన్ బన్నీకి ఇచ్చేసినట్లు తెలుస్తోంది.

ఏపీ రాజధానిని వైఎస్ జగన్ మారుస్తారా?