మళ్లీ అర్జున్ రెడ్డి బాటలోనే...

అర్జున్ రెడ్డి సినిమా అటుఇటుగా 3 గంటల నిడివి ఉంది. హిట్ అయిన తర్వాత అదనంగా సన్నివేశాలు జోడించడంతో రన్ టైమ్ మరో 8 నిమిషాలు పెరిగింది. ఇప్పుడు అదే బాటలో విజయ్ దేవరకొండ నటిస్తున్న డియర్ కామ్రేడ్ కూడా ఉంది. అవును.. ఈ సినిమా రన్ టైమ్ కూడా ఏకంగా 2 గంటల 49 నిమిషాలుంది.

నిజానికి ఈ సినిమా డ్యూరేషన్ ను 2 గంటల 30 నిమిషాలకు కుదించారు. కానీ స్వయంగా విజయ్ దేవరకొండ రంగంలోకి దిగి 169 నిమిషాల రన్ టైమ్ ను లాక్ చేశాడు. అదే సెటప్ తో సెన్సార్ కూడా పూర్తిచేసుకున్న ఈ సినిమా యు/ఎ సర్టిఫికేట్ పొందింది.

కేవలం రన్ టైమ్ లోనే కాదు.. ఈ సినిమాకు సంబంధించి ప్రతి అంశాన్ని తనే దగ్గరుండి చూసుకుంటున్నాడు విజయ్ దేవరకొండ. విజయ్ ఆదేశాల మేరకే సినిమాకు సంబంధించి కొన్ని సన్నివేశాల్ని రీషూట్ కూడా చేశారు. ఇప్పుడు ప్రచారం కూడా విజయ్ కనుసన్నల్లోనే జరుగుతోంది.

విజయ్ మార్కెట్ ను డిసైడ్ చేసే సినిమాగా మారింది డియర్ కామ్రేడ్. గీతగోవిందం బ్లాక్ బస్టర్ అయినప్పటికీ టాక్సీవాలా విజయ్ మార్కెట్ ను ఫిక్స్ చేయలేకపోయింది. అందుకే ట్రేడ్ మొత్తం ఇప్పుడు డియర్ కామ్రేడ్ వైపు చూస్తోంది. విజయ్ దేవరకొండ-రష్మిక జంటకు కూడా మార్కెట్లో మంచి క్రేజ్ ఉంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఒకేసారి విడుదలకానుంది డియర్ కామ్రేడ్ సినిమా.

ఆమెను ఆమెగా ప్రేమించేవాడే కావాలట..!

ఎన్ని సినిమాలు పోయినా తీస్తూనే ఉంటా..