దాసరి మారుతి 'తాత-మనవడు'

దర్శకుడు దాసరి నారాయణరావు తొలి సినిమా తాత మనవడు. 'తాతకు నువ్వు చేసే మర్యాద రేపు నేను నీకు చేయాలి కదా' అనే మాటతో తండ్రికి పాఠం చెప్పే మనవడి కథ. మళ్లీ ఇన్నాళ్లకు దర్శకుడు దాసరి మారుతి తాత మనవళ్ల అనుబంధాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రతి రోజు పండగే అంటూ టైటిల్ పెట్టి ఇప్పటికి సగానికి పైగా పూర్తి చేసిన ఈ సినిమా మోషన్ పోస్టర్ ను విడుదల చేసారు.

వర్షంలో తాత ఆనందగా హుషారుగా చిందులు వేస్తుంటే, గొడుగు పట్టుకున్న మనవడు ఆశ్చర్యం, ఆనందం కలగలిసిన వైఖరితో వారించే ప్రయత్నం చేస్తున్నట్లు ఈ పస్ట్ లుక్ మోషన్ పోస్టర్ విడుదల చేసారు. పచ్చని పల్లెటూరి పరిసరాల నేపథ్యం సమకూర్చారు. 

ఇప్పటి వరకు ఎంటర్ టైన్ మెంట్ జోనర్ లో సినిమాలు అందిస్తూ వస్తున్న దర్శకుడు మారుతి తొలిసారి ఎమోషనల్ కంటెంట్ ను అందిస్తున్నట్లు కనిపిస్తోంది. తాతగా సత్యరాజ్, మనవడిగా సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న ఈ సినిమాలో రాశీఖన్నా హీరోయిన్. యువి క్రియేషన్స్ సమర్పణలో ఈ సినిమా తయారవుతోంది.