హైకోర్టు నోటీసులు.. బాబు ఇప్పుడేమంటారు?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి మీద జరిగిన హత్యాయత్నం విషయంలో విచారణ ఆసక్తిదాయకంగా మారింది. ఈ వ్యవహారంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హైకోర్టు తలుపు తట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విచారణలో భాగంగా పలువురుకు నోటీసులు జారీచేసింది ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టు.

ఈ వ్యవహారంలో నోటీసులు అందుకుంటున్న వారిలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉండటం ఆసక్తిదాయకం. చంద్రబాబు, ఏపీ డీజీపీ, తెలంగాణ డీజీపీ, కేంద్ర హోంశాఖతో సహా మొత్తం ఎనిమిది మందికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. రెండువారాల సమయం ఇస్తూ స్పందించాలని ఆదేశిస్తూ కోర్టు తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

ఇది అత్యంత ఆసక్తిదాయకమైన అంశం. జగన్ పై హత్యాయత్నం విషయంలో ఇప్పటివరకూ ఏపీ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు, ఏపీ డీజీపీ స్పందించింది ఒక ఎత్తు.. ఇప్పుడు కోర్టుకు ఇచ్చే సమాధానం మరో ఎత్తు. జగన్ పై అటాక్ జరిగిన కాసేపటికే ఏపీ డీజీపీ మీడియా ముందుకు వచ్చి.. నిందితుడి కులం పేరు చెప్పి, అతడు జగన్ అభిమానే అంటూ మాట్లాడాడు. ఆ తీరు వివాదాస్పదం అయ్యింది. ఒక రాష్ట్ర డీజీపీ అంత బాధ్యతారాహిత్యంగా మాట్లాడటం ఏమిటని అనేకమంది ఆయన తీరును విమర్శించారు.

ఇక చంద్రబాబు కూడా పలు రకాలుగా స్పందించారు. మొదటేమో అదంతా డ్రామా అని వ్యాఖ్యానించిన చంద్రబాబు, ఆ తర్వాత జగన్ మీద జగన్ అటాక్ చేయించుకున్నాడు అని తను అనలేదన్నాడు. ఆ తర్వాత వైసీపీ కోడి పత్తి పార్టీ అంటూ వ్యంగ్యంగా మాట్లాడాడు. తన కౌంటర్ పార్ట్ మీద తనపాలనలో అటాక్ జరిగితే.. ఒక ముఖ్యమంత్రి అలా మాట్లాడటం విడ్డూరమే.

మరి చంద్రబాబు ఇప్పుడు కోర్టుకు ఏమని సమాధానం ఇస్తాడు? తను ఇంతకు ముందు చేసిన వ్యాఖ్యలనే రిపీట్ చేస్తాడా? లేక మరోరకంగా స్పందిస్తాడా? అనేది ఆసక్తిదాయకమైన అంశం. అలాగే నటుడు శివాజీ చెప్పిన గరుడపురాణాన్ని కూడా జగన్ తరఫు న్యాయవాది హైకోర్టుకు విన్నవించినట్టుగా తెలుస్తోంది.

ఇదంతా ప్రీ ప్లాన్డ్ అని.. ఈ అంశంపై స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించాలని కోరినట్టుగా సమాచారం. ఇక ఇప్పటికే ఈ అంశంపై విచారణ జరుపుతున్న సిట్ కు కూడా కోర్టు నోటీసులు ఇచ్చింది. తమకు సీల్డ్ కవర్ నివేదిక ఇవ్వాలని సిట్ అధికారులను కూడా కోర్టు ఆదేశించినట్టుగా సమాచారం.

టీడీపీ ఎమ్మెల్యేకు జేసీ అనుచరుడితో టెన్షన్‌!.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్ 

Show comments

Related Stories :