అరెరే.. లోకేష్ మళ్లీ బుక్ అయిపోయారు!

ఏదో బ్రహ్మ పదార్థాన్ని కనుగొన్నట్టుగా లోకేష్ బాటు ట్వీట్ వేయడం.. దానికి నెటిజన్లు స్ట్రాంగ్ కౌంటర్లు ఇవ్వడం.. జరిగిపోయింది. ఇదివరకూ లోకేష్ బాబు డైరెక్టు స్పీచ్ లతో దొరికిపోయేవారు. ఏదో మాట్లాడబోయి.. మరేదో మాట్లాడుతూ.. లోకేష్ బుక్ అయిపోయేవారు. అందుకు ఇప్పుడు అవి తగ్గిపోయాయి. కేవలం ట్విటర్ కే పరిమితం అవుతూ వాటిని తప్పించుకుంటున్నారు లోకేష్. అయితే అక్కడ కూడా ఈయనను నెటిజన్లు ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు.

ఈయన ట్వీట్ వేస్తూ ఉంటే.. నెటిజన్లు కౌంటర్లు ఇస్తూ ఉన్నారు... ప్రధాని మోడీ మీటింగుకు జగన్ ఆటోలు పంపించారని.. ఏదో వాదన మొదలుపెట్టాడు లోకేష్. అందుకు సంబంధించి ఫొటోలను చూపిస్తూ మీడియాతో మాట్లాడారు. అలాగే ట్విటర్లో కూడా పెట్టారు. తనేదో బ్రహ్మాస్త్రాన్ని సంధించినట్టుగా లోకేష్ ఫీలయ్యారు. అయితే కౌంటర్లు ఇచ్చేవాళ్లు మాత్రం అలా అనుకోలేదు. లోకేష్ ను ఒక ఆటాడుకున్నారు.

'పప్పు ఆటో డ్రైవర్ జగన్ గారి మీద అభిమానంతో తన ఆటోకి వెనకమాల స్టికర్ వేసుకున్నాడు... బీజేపీ వాళ్ళ మీటింగ్ కి ఆటోని కిరాయికి పెట్టాడు... ఇది కూడా తెలియదా.. అందుకు కదూ నిన్ను పప్పు అనేది..' అంటూ మొదలుపెట్టి.. లోకేష్ కు నెటిజన్లు కౌంటర్లు ఇచ్చారు.

ఇటీవల లోకేష్ సభ ఒకదాంట్లో జగన్ స్టిక్కర్లున్న కుర్చీల ఫొటోలను మరి కొందరు పోస్టు చేశారు. కుర్చీలు అద్దెకు ఇచ్చుకునే వాళ్లు పార్టీలు చూడరు కదా. అదే విధంగా అద్దెకు వెళ్లే ఆటో వాళ్లు ఫలానా పార్టీకి వెళ్లమని అనరు కదా.. కాబట్టి ఇలాంటివన్నీ సహజం అనుకోవాలి. అయితే లోకేష్ కు మాత్రం ఇది బ్రహ్మాండం బద్ధలైన విషయం అనిపించింది. ట్వీటారు. ఇరుకున్నారు.

‘లోకేష్ కు కామన్ సెన్స్ లేదు..’ అని అనడంతో ఆగలేదు నెటిజన్లు. ప్రత్యేకహోదా పోరాటం అని లోకేష్ అనడంతో.. గతంలో ప్రత్యేకహోదా అంశంలో చంద్రబాబు ఏం మాట్లాడారు, తెలుగుదేశం వాళ్లు ఏమన్నారు.. అనే అన్ని విషయాలనూ ప్రస్తావిస్తూ చాకిరేవు పెట్టారు. అలా లోకేష్ బుక్ అయ్యారు!