కార్పొరేషన్ సాక్షిగా కలిసిపోయారు...?

ఏపీలో భవిష్యత్తు రాజకీయాలకు సంకేతాలు విశాఖ కార్పోరేషన్ సమావేశంలో కనిపించాయి. ఆవేశంలోనూ ఆనందంలోనూ కూడా టీడీపీ, జనసేన ఒక్కటిగా ముందుకు  కదిలడమే విశేష పరిణామం.జీవీఎంసీలో అధికారంలో ఉన్న వైసీపీని అడ్డుకునేందుకు ఈ రెండు పార్టీలు ప్రయత్నించడం విశేషం.  

విశాఖలో మెజారిటీ సీట్లు వైసీపీకి దక్కాయి. బలమైన ప్రతిపక్షంగా మరో వైపు టీడీపీ ఉంది. ఇక మూడు సీట్లు జనసేన గెలిచింది. నిజానికి టీడీపీకి సరిపడనంత బలం ఉంది.

వైసీపీ విధానాలను వ్యతిరేకించాలంటే ఆ పార్టీయే సొంతంగా చేయవచ్చు. అదే సమయంలో గతంలో ఎన్నోసార్లు జీవీఎంసీ ఎన్నికల్లో గెలిచిన చరిత్రతో పాటు పోరాడే అనుభవం  కూడా ఉంది. 

మరి ఇన్ని ఉన్నా కూడా సంఖ్యాపరంగా పెద్ద నంబర్ కానీ జనసేనతో టీడీపీ చేతులు కలిపి వైసీపీ మీద రాజకీయ దాడి చేయడం భవిష్యత్తు రాజకీయానికి సంకేతం అంటున్నారు.

అదే సమయంలో మిత్రపక్షంగా ఉన్న బీజేపీతో జనసేన సభ్యులు అసలు కలవకపోవడమూ విడ్డూరమే. మొత్తానికి చూస్తే కార్పోరేషన్ లో ఉన్న పార్టీలలో వామపక్షాలు, టీడీపీ జనసేన ఒక కూటమి కట్టాయి. ఇది రేపటి ఏపీ రాజకీయాల్లోనూ కనిపించే సీన్ కాదు కదా అన్నదే రాజకీయ మేధావుల మాటగా ఉంది.

Show comments